నిర్మల్ జిల్లాలో సంచలనం సృష్టించిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను 2026 ఆగస్టు 6న మీడియాకు వెల్లడించారు. వ్యక్తి హత్యలో భార్య హంతకురాలని పోలీసులు నిర్ధారించారు.
నిర్మల్ జిల్లా కుంటాల. లింబా బి గ్రామంలో బాలాజీ అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. సిలిండర్ పేలిందని అనుకున్నప్పటికీ.. మృతుడి భార్య అనుమానాస్పద వైఖరిపై కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. షాకింగ్ విషయాలను కనుగొన్నారు. భర్త బాలాజీనే భార్య గొంతు నులిమి చంపినట్లు విచారణలో తేలింది.
చోక్కాతో గొంతు నులిమి చంపిన భార్య.. గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయాడని చిత్రికరీంచింది. రక్త మరకలను తుడిపివేసి ఆదారాలను మాయం చేసింది.
భర్త బాలాజీ మద్యానికి బానిసైనట్లు పోలీసులకు తెలిపింది భార్య. మద్యం తాగి తరుచు గొడవ పడుతున్నట్లు చెప్పింది. తాగుడుకు డబ్బులు ఇవ్వాలని తరచూ వేధిస్తుండటంతోనే ఈ పని చేసినట్లు ఒప్పుకుంది. ఈ కేసులో బార్యను అరెస్టు చేసినట్లు ఏ ఎస్పీ. సాయి కిరణ్ తెలిపారు.
