రైతుల నుంచి రూ. 80 వేల లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన జీపీవో

రైతుల నుంచి రూ. 80 వేల లంచం..  ఏసీబీకి అడ్డంగా దొరికిన జీపీవో

తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులను ఎక్కడిక్కడ  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది. లేటెస్ట్ గా రైతుల నుంచి లంచం తీసుకుంటుండగా (గ్రామ పరిపాలన అధికారి) జీపీవోను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. 

మంచిర్యాల జిల్లా  భీమిని మండల తహసీల్దార్ కార్యాలయంలో జీపీవోగా విధులు నిర్వహిస్తున్న దుర్గాప్రసాద్‌ను ఏసీబీ  అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఒక కేసు విషయంలో పెద్దంపేటకు చెందిన రైతు మహమ్మద్ ఫకీర్ వద్ద దుర్గాప్రసాద్ రూ.80 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లంచం మొత్తాన్ని తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఆయనను పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.