ఆసియా గేమ్స్ లో ఇండియా షూటర్ల హవా.. స్కీట్ విభాగంలో కాంస్యం..

ఆసియా గేమ్స్ లో ఇండియా షూటర్ల హవా.. స్కీట్ విభాగంలో కాంస్యం..

షూటింగ్‌‌‌‌లో ఇండియా షూటర్ల హవా కొనసాగుతోంది. స్కీట్‌‌‌‌ విభాగంలో మెన్స్‌‌‌‌, విమెన్స్‌‌‌‌ జట్లు కాంస్య పతకాలను సాధించాయి. అయితే వ్యక్తిగత విభాగాల్లో మాత్రం తృటిలో పతకాలు చేజారాయి. రైజా దిల్లాన్‌‌‌‌–మహేశ్వరి చౌహాన్‌‌‌‌–పరీనాజ్‌‌‌‌ దలివాల్‌‌‌‌తో కూడిన ఇండియా త్రయం 331 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. 

చైనా (357), కజకిస్తాన్‌‌‌‌ (336) వరుసగా గోల్డ్‌‌‌‌, సిల్వర్‌‌‌‌ సాధించాయి. వ్యక్తిగత ఫైనల్స్‌‌‌‌లో రైజా దిల్లాన్‌‌‌‌ (23 పాయింట్లు), పరీనాజ్‌‌‌‌ దలివాల్‌‌‌‌ (8) వరుసగా నాలుగు, ఎనిమిదో ప్లేస్‌‌‌‌తో సరిపెట్టుకున్నారు. మెన్స్‌‌‌‌ స్కీట్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఫైనల్లో అనంత్‌‌‌‌జీత్‌‌‌‌ సింగ్‌‌‌‌ నరుకా (119), మైరాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (116), భవ్‌‌‌‌తేజ్‌‌‌‌ సింగ్‌‌‌‌ గిల్‌‌‌‌ (111) త్రయం 346 పాయింట్లతో బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను గెలిచారు. వ్యక్తిగత ఫైనల్లో నరుకా నాలుగో ప్లేస్‌‌‌‌తో సంతృప్తి పడ్డాడు. విమెన్స్‌‌‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌‌‌ రైఫిల్‌‌‌‌ పిస్టల్‌‌‌‌ వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్‌‌‌‌ విజేత మను భాకర్‌‌‌‌ ఐదో ప్లేస్‌‌‌‌తో నిరాశపర్చింది. 

ఫైనల్లో ఆమె 181.1 పాయింట్లకే పరిమితమైంది. క్వాలిఫయింగ్‌‌‌‌లో నిరాశపర్చిన ఇషా సింగ్‌‌‌‌ (572), సురుచి సింగ్‌‌‌‌ (568) వరుసగా 15, 26వ స్థానాలతో ఫైనల్స్‌‌‌‌కు అర్హత సాధించలేకపోయారు. టీమ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లోనూ ఇండియాకు నిరాశ తప్పలేదు. ఇండియా, వియత్నాం సమానంగా 1719 పాయింట్లు సాధించినా.. ఇన్నర్‌‌‌‌ టెన్‌‌‌‌ల లెక్కింపులో ఇండియా వెనకబడటంతో నాలుగో ప్లేస్‌‌‌‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.