జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం... ఓవర్ స్పీడ్ డివైడర్ ను ఢీకొన్న బైక్.. మనవడు మృతి, తాతకు తీవ్ర గాయాలు..

జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం... ఓవర్ స్పీడ్ డివైడర్ ను ఢీకొన్న బైక్.. మనవడు మృతి, తాతకు తీవ్ర గాయాలు..

జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో బైక్ డివైడర్ ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ( ఆగస్టు 9 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల పట్టణంలోని బైపాస్ లో రోడ్డులో జరిగింది ఈ ప్రమాదం. ఓవర్ స్పీడ్ తో వస్తున్న బైక్ మూలమలుపు దగ్గర డివైడర్ ను ఢీకొట్టింది.

పెగడపల్లి మండలం ఢీకొండ గ్రామానికి చెందిన గంగాధర్ తన తాతతో కలిసి బైక్ పై వెళ్తుండగా ఘటన జరిగింది. ఈ ఘటనలో గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందగా...తాతకు తీవ్ర గాయాలయ్యాయి. 

►ALSO READ | యాదాద్రి భువనగిరిలో షాకింగ్ ఘటన.. రూ.54 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

తాతను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గంగాధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

గంగాధర్ జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. గంగాధర్ తల్లిదండ్రులు గతంలో అనారోగ్యంతో మృతి చెందగా.. ఇప్పుడు గంగాధర్ యాక్సిడెంట్ లో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.