పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగ నోటిఫికేషన్.. మినిమమ్ డిగ్రీ ఉంటె చాలు.. కొద్దిరోజులు ఛాన్స్...

పంజాబ్ నేషనల్ బ్యాంకులో  ఉద్యోగ నోటిఫికేషన్..  మినిమమ్ డిగ్రీ ఉంటె చాలు.. కొద్దిరోజులు ఛాన్స్...

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్​బీ) జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్–I (జేఎంజీఎస్–I) విభాగంలో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (ఎల్​బీఓ). 

 మొత్తం ఖాళీలు: 545.  తెలంగాణ రాష్ట్రంలో 41 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో క్లరికల్/ ఆఫీసర్ క్యాడర్‌లో అభ్యర్థులు కనీసం ఏడాది పోస్ట్- క్వాలిఫికేషన్ పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఆగస్టు 16.

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ రాత పరీక్ష, అప్లికేషన్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ ibpsreg.ibps.in/pnbjul26ను సందర్శించండి. 

ఎగ్జామ్ ప్యాటర్న్
ఆన్​లైన్ పద్ధతిలో నిర్వహించే రాత పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు (సమయం 35 నిమిషాలు), డేటా అనాలసిస్  ఇంటర్​ప్రిటేషన్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు (35 నిమిషాలు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు (25 నిమిషాలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు (35 నిమిషాలు), జనరల్/ ఎకానమి/ బ్యాంకింగ్ అవేర్​నెస్ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు (50 నిమిషాలు) ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు. ప్రతి సెక్షన్​కు నిర్దిష్ట సమయం కేటాయించారు. ఆ సమయంలోనే ఆ సెక్షన్​లోని ప్రశ్నలకు జవాబులను గుర్తించాల్సి ఉంటుది. 

కనీస అర్హత మార్కులు
బ్యాంకు నిర్వహించే పరీక్షలో ప్రతి విభాగంలోనూ జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 40 శాతం, రిజర్వ్​డ్ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్
దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను 10 లేదా 12వ తరగతిలో ఒక సబ్జెక్టుగా చదవని అభ్యర్థులు తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (ఎల్ఎల్​పీటీ) రాయాల్సి ఉంటుంది. ఇది కేవలం అర్హత  పరీక్ష మాత్రమే. కానీ, అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి.

మినహాయింపు: 10 లేదా 12వ తరగతిలో స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివిన అభ్యర్థులకు ఎల్ఎల్ పీటీ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే, ధ్రువపత్రాల పరిశీలన సమయంలో అభ్యర్థులు సరైన ఆధారాలను సమర్పించడం తప్పనిసరి.

పర్సనల్ ఇంటర్వ్యూ
ఆన్‌లైన్ రాత పరీక్షలో అర్హత సాధించిన షార్ట్​లిస్ట్ చేసిన అభ్యర్థులందరినీ ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూను మొత్తం 50 మార్కులకు నిర్వహిస్తారు.

కనీస అర్హత మార్కులు: ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కనీసం 45 శాతం, మిగతా అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులు సాధించడంలో విఫలమైన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తారు.