ఇండో- టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లోని హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
మొత్తం ఖాళీలు: 21 (అన్ రిజర్వ్డ్ –7, ఎస్సీ–4, ఓబీసీ– 7, ఈడబ్ల్యూఎస్–3).
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు సంబంధిత ట్రేడ్‌లో మోటార్ మెకానిక్ సర్టిఫికెట్ అనుభవం లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 28.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు ఉండదు. ఇతరులకు రూ.100.
లాస్ట్ డేట్: అక్టోబర్ 27.
సెలెక్షన్ ప్రాసెస్: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ recruitment.itbpolice.nic.inను సందర్శించండి.
