అస్సాం రైఫిల్స్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ–2026 నోటిఫికేషన్ డైరెక్టరేట్ జనరల్ అస్సాం రైఫిల్స్ విడుదల చేసింది. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఈ నోటిఫికేషన్ ద్వారా18 టెక్నికల్ ట్రేడ్స్ ల్లో 354 గ్రూప్– సి పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 28న ప్రారంభం కానుండగా అక్టోబర్ 28 వరకు అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: ఆల్- ఇండియా గ్రూప్-–సి టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.
మొత్తం ఖాళీలు: 354.
విభాగాల వారీగా ఖాళీలు
వారెంట్ ఆఫీసర్ (సైఫర్)– 12, రైఫిల్మన్ (ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్)– 32, రైఫిల్మన్ (లైన్‌మ్యాన్ ఫీల్డ్)– 21, రైఫిల్మన్ (ఆర్మరర్)– 29, రైఫిల్మన్ (ఇంజినీర్ ఎక్విప్‌మెంట్ మెకానిక్)– 10, రైఫిల్మన్ (రికవరీ వెహికల్ మెకానిక్)– 13, రైఫిల్మన్ (ఎలక్ట్రీషియన్ మోటార్ వెహికల్)– 22, హవల్దార్ (ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్)– 06, రైఫిల్మన్ (మెటల్‌స్మిత్)– 19, రైఫిల్మన్ (అప్హోల్స్టర్)– 03, రైఫిల్మన్ స్టోర్ కీపర్ టెక్నికల్ (ఈఎంఈ)– 16, రైఫిల్మన్ (వెహికల్ మెకానిక్)– 23, రైఫిల్మన్ (వెల్డర్)– 02, వారెంట్ ఆఫీసర్ (డ్రాఫ్ట్స్‌మ్యాన్)– 02, వారెంట్ ఆఫీసర్ (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్)– 01, వారెంట్ ఆఫీసర్ (ఫిజియోథెరపిస్ట్)– 02, రైఫిల్మన్ (మేసన్)– 29.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. అలాగే, సంబంధిత విభాగంలో ఐటీఐ లేదా డిప్లొమా కలిగి ఉండాలి.
వయసు: 2026, జులై 1 నాటికి18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 28.
లాస్ట్ డేట్: అక్టోబర్ 28.
రిక్రూట్‌మెంట్ ర్యాలీ తేదీ: నవంబర్ 23 (తాత్కాలికం).
సెలెక్షన్ ప్రాసెస్
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ) & ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ట్రేడ్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ assamrifles.gov.in ను సందర్శించండి.
