జ్యోతిష్యం:ఏ రాశి వారు ఏరంగు పర్స్ వాడాలి.. ఈ కలర్ వాడితే ఎప్పుడూ ఖాళీ అవదు..!

జ్యోతిష్యం:ఏ రాశి వారు ఏరంగు పర్స్ వాడాలి.. ఈ కలర్ వాడితే  ఎప్పుడూ ఖాళీ అవదు..!

 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..  ప్రతి రాశికి ఒక గ్రహం అధిపతిగా ఉంటారు. ఆ గ్రహాన్ని బట్టి అదృష్ట రంగులు నిర్ణయించబడతాయి. సాధారణంగా బయటకు వెళ్లే టప్పుడు పర్స్​ లో డబ్బులు పెట్టుకొని బయటకు వెళతారు. అయితే రాశిని బట్టిని పర్స్​ కలర్​ ను ఎంచుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సరైన రంగు పర్సు వాడటం వలన అదృష్టం కలిసి వచ్చి.. పర్సు ఎప్పుడూ ఖాళీ అవదని.. లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు 12 రాశుల వారు ఎవరు ఎలాంటి రంగు పర్స్​ వాడాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం...!

జ్యోతిష్యం   ప్రతి రాశి వారికి ఒక నిర్దిష్టమైన అదృష్ట రంగు ఉంటుంది. ఆ రంగు పర్సు  వాడటం వల్ల ధనాకర్షణ పెరిగి , ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.  

  • మేష రాశి :   ముదురు గులాబీ రంగు, ఎరుపు, నారింజ
  • వృషభ రాశి : పింక్​ కలర్,​ ఆకుపచ్చ, తెలుపు రంగులు.
  • మిథున రాశి:  బూడిద రగు, లేత ఆకుపచ్చ, పసుపు రంగుల పర్స్​ లు 
  • కర్కాటక రాశి :  పాల రంగు షేడ్​ కలర్​, సిల్వర్​, తెలుపు రంగు పర్సు
  • సింహ రాశి :  పర్పుల్​, గోల్డ్​ ​ కలర్​ , ఆరెంజ్
  • కన్యా రాశి: నేవీ బ్లూ, ఆకుపచ్చ, మట్టి , గోధుమ రంగు 
  • తుల రాశి :  లేత నీలి రంగు, తెలుపు, గులాబీ రంగు పర్స్​ 
  • వృశ్చిక రాశి :  మెరూన్​ కలర్​, బ్లాక్​ కలర్​, ముదరు ఎరుపు రంగు పర్స్​ 
  • ధనుస్సు రాశి : బ్లూ కలర్​, రాయల్​ కలర్​, పర్పుల్​ కలర్​, లేత రంగు పర్స్​లు 
  • మకర రాశి:  ముదురు రంగు పర్స్​ లు, నలుపు,  గోధుమ రంగు 
  • కుంభ రాశి :  బ్లూ కలర్​, గ్రీన్​ అండ్​ బ్లూ మిక్స్​ కలర్​ పర్స్​లు 
  • మీన రాశి :  లేత రంగులు, గ్రీన్ కలర్​, సముద్రంలోని నీటి కలర్​ పర్స్​ లు 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.