ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. అంతేకాదు ఇంటి నిర్మాణం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వాస్తు దోషం ఉంటే సరి చేసుకోవాలా.. లేకపోతే ఎలాంటి నష్టాలొస్తాయి.. వాస్తు సమస్యతో స్థలం సేల్ కాకపోతే ఎలాంటి రెమిడీస్ చేయాలి. ...మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు ఏమంటున్నారో చూద్దాం...
ప్రశ్న: వాస్తు దోషాలున్నప్పుడు కచ్చితంగా వాటిని మార్చుకోవాలా? లేకపోతే నష్టం ఉంటుందా?
జవాబు:ఇంట్లో వాళ్లపై వాస్తు పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. వాస్తు సరిగ్గా ఉంటే ఇంట్లో అంతా పాజిటివ్ గా ఉంటుంది. అలాగని వాస్తు లోపాలు ఉంటే చెడు జరుగుతుందని కాదు. చిన్నచిన్న లోపాలున్నా, ఇతర అంశాలు కలిసొచ్చి అంతా మంచే జరగొచ్చు. టైంను బట్టి వాస్తు ప్రభావం చూపిస్తుంది
ప్రశ్న: మాకు పడమరవైపు ఫేసింగ్ తో ఒక స్థలం ఉంది. దాన్ని చాలా కాలంగా అమ్మాలనుకుంటున్నాం. కానీ, వాస్తు దోషం ఉందనే కారణంతో ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీనికేమైనా పరిష్కారం ఉందా?
జవాబు: చాలా స్థలాలకు ఇలాగే వాస్తు దోషాలు ఉంటాయి. అంతమాత్రాన అవి పనికిరావని కాదు. కొన్ని మార్పులు చేయడం వల్ల దోషాలను వీలైనంత వరకు సరిదిద్దవచ్చు. సరైన వాస్తు నిపుణులు స్వయంగా చూసి మాత్రమే దీనికి పరిష్కారం, దోష నివారణ చేయగలుగుతారు.. మంచి వాస్తు నిపుణులను సంప్రదించి, సరైన సలహా తీసుకోండి
