మేఘాలయ హనీమూన్ బాధితుడు రాజా రఘువంశీ బ్రదర్స్ ఎంత పనిచేశారంటే..

మేఘాలయ హనీమూన్ బాధితుడు రాజా రఘువంశీ బ్రదర్స్ ఎంత పనిచేశారంటే..

మేఘాలయ హనీమూన్ హత్య కేసు గుర్తుండే ఉంటుంది. ఈ కేసులో బాధితుడు, భార్య, ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురైన రాజా రఘువంశీ సోదరులు ఇద్దరినీ ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్వతహాగా వ్యాపార కుటుంబమైన రాజా రఘువంశీ ఫ్యామిలీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అతని పేరు మీద ఒక దాబా నడుపుతున్నారు.

అయితే.. ఆ దాబాలో లైసెన్సు లేకుండా మద్యం విక్రయించారనే ఆరోపణలపై ఇండోర్ పోలీసులు అతని సోదరులను అరెస్టు చేశారు. పోలీసులు ఇండోర్ ప్రాంతంలోని హోటళ్లు, దాబాలలో సాధారణ తనిఖీ చేయగా.. క్యాట్ రోడ్డులోని రాజా భోజ్ ధాబాలో అనుమతి లేకుండా వినియోగదారులకు మద్యం అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

►ALSO READ | నా అల్లుడు 25 మందిని పెళ్లి చేసుకున్న పచ్చిమోసగాడు: బీజేపీ ఎమ్మెల్యే

ఈ కేసులో.. దాబా మేనేజర్ సచిన్ రఘువంశీ, ఆపరేటర్ విపిన్ రఘువంశీ సహా ఆరుగురిపై ఎక్సైజ్ చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు. రూల్స్ ప్రకారం దాబాలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేయాలని.. ఆ పని కూడా చేయలేదని పోలీసులు తెలిపారు.

సచిన్, విపిన్‌లు రాజా రఘువంశీకి అన్నదమ్ములని, వారు రాజా రఘువంశీ పేరు మీద దాబాను నడుపుతున్నారని పోలీసులు చెప్పారు. రఘువంశీ ఇద్దరు సోదరులను ఈ కేసులో కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరినీ జైలుకు పంపారు.