హైదరాబాద్ సిటీ, వెలుగు: ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఆరోపించారు. శనివారం రాత్రి గోల్కొండ మిలాద్ గ్రండ్లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతల డైరెక్షన్‌లోనే అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
జెన్యూన్ ఓటర్ల పేర్లను ఫారం-7 ద్వారా తొలగించడాన్ని సహించబోమన్నారు. ఇప్పటికే ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా చేశామని, ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశామని ఓవైసీ తెలిపారు. అవసరమైతే హైదరాబాద్‌లోని గల్లీ గల్లీలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణిని వీడాలని కోరారు. ఓటర్ల హక్కులను కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడుతామని హెచ్చరించారు.
