తెల్లజుట్టుని నల్లగా మార్చడానికి మన వంటింట్లోనే బెస్ట్ ట్రీట్ మెంట్ ఉంది. ఎలాంటి కెమికల్స్ వాడకుండా సహజపద్ధతిలో చేసే. ఈ ట్రీట్ మెంట్ వల్ల జుట్టు నల్లగా మారడంతో పాటు జుట్టు కుదుళ్ళు ఆరోగ్యంగా మారతాయి.. ఇప్పుడు ఆ టిప్స్ గురించి తెలుసుకుందాం. . !
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు కావాల్సినవి
- ఉల్లిగడ్డ ముక్కలు-అర కప్పు
- నీళ్లు -కావాల్సినంత
ఎలా తయారు చేయాలంటే..!
ఉల్లిగడ్డని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని 20 నిమిషాల పాటు నీళ్లలో ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల ఉల్లిలో ఉన్న ఔషధ గుణాలన్నీ నీళ్లతో చేరతాయి. అందుకే ఆ నీటిని చల్లార్చి వడకట్టి జుట్టుకు, కుదుళ్లకు పట్టించాలి.
అరగంట తర్వాత గాఢత తక్కువఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు చేస్తే తెల్లజుట్టు సమస్య నుంచి బయటపడొచ్చు. అంతేకాదు ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉండటం వల్ల తలలో రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టుకుదుళ్లకు మంచి పోషణ లభిస్తుంది. దాంతో తెల్లవెంట్రుకలు నల్లగా మారడంతో పాటు రీ గ్రోత్ అవడానికి కూడా సహాయపడుతుంది.
మరికొన్ని చిట్కాలు
- ఒక కప్పు ఎండబెట్టిన ఉసిరి పొడి, రెండు కప్పుల పెరుగు తీసుకుని ఒక గిన్నెలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. ఇలా వారానికి ఒక సారి క్రమం తప్పకుండా చేస్తే తెల్ల జుట్టు నల్లబడుతుంది.
- కొబ్బరినూనెలో కర్పూరం పొడిని కలిపి ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు తలకు పట్టించి 5నిమిషాల సేపు మసాజ్ చేయాలి.
వెలుగు,లైఫ్
