T20 World Cup: పాకిస్తాన్ బ్యాటర్ల ఊచకోత.. శ్రీలంకపై భారీ స్కోర్

T20 World Cup: పాకిస్తాన్ బ్యాటర్ల ఊచకోత.. శ్రీలంకపై భారీ స్కోర్

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటర్లు చెలరేగారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8  వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అయితే టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ తీసుకోవడంతో.. మొదట బ్యాటింగ్ కి వచ్చిన పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్లు విజృంభించారు. దీంతో 15.4 ఓవర్ వేసిన దుష్మంత చమీర బౌలింగ్ లో 176 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.  ఫఖర్ జమాన్  42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులతో 84 పరుగులు చేసి క్లిన్ బౌల్డ్ అయ్యాడు. తొలి ఇన్సింగ్స్ ప్రారంభమైనప్పటికీ నుంచే పాక్ బ్యాటర్లు లంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని భారీగా పరుగులు చేశారు.  
  
ఫఖర్ జమాన్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన ఖవాజా నఫే (2) ఎక్కువ సేపు మైదానంలో నిలవలేకపోయాడు. దిల్షన్ మధుశంక బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి చరిత్ అసలంకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.  అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన షాదాబ్ ఖాన్ (7) సైతం క్రీజులో నిలదొక్కులేకపోయాడు.. దుష్మంత చమీర వేసిన ఫుల్ టాస్ బంతిని షాదాబ్ స్క్వేర్ వెనుకకు ఫ్లిక్ చేశాడు, రెండో పరుగు కోసం వెళ్లగా షాదాబ్ ని దిల్షాన్ మదుశంక రనౌట్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కి  వచ్చిన మహ్మద్ నవాజ్ (0), పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా (0) వరుస బంతుల్లోనే శ్రీలంక సారథి దాసున్ శనక  ఔట్ చేయడంతో దాయాది దేశం తీవ్ర కష్టాల్లో పడింది.  

అయితే వరుస వికెట్లు పడుతున్న కూడా మరో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ తన దూకుడైన బ్యాటింగ్ తో  60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులతో శతకం (100 పరుగులు) బాదిన తర్వాత దిల్షాన్ మధుశంక బౌలింగ్ లో అవు అయ్యాడు.  అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన షాహీన్ అఫ్రిది సైతం దిల్షాన్ మధుశంక (4) బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.  దీంతో 20 ఓవర్లలో పాకిస్తాన్ 212 పరుగులు చేసి, శ్రీలంక జట్టుకి 213 పరుగుల టార్గెట్ ఇచ్చింది. కాగా లంక బౌలర్లలో  దిల్షాన్ మధుశంక కీలకమైన మూడు వికెట్లు తీసుకుని పాక్ జట్టు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. అలాగే, దాసున్ శనక రెండు వికెట్లు తీసుకోగా,  దుష్మంత చమీర ఒక వికెట్ పడగొట్టాడు.