బంగ్లాదేశ్తో 3 వన్డేలు, 3 టీ20లు.. కేంద్రం అనుమతి కోసం బీసీసీఐ ప్రయత్నం!

బంగ్లాదేశ్తో 3 వన్డేలు, 3 టీ20లు.. కేంద్రం అనుమతి కోసం బీసీసీఐ ప్రయత్నం!

India vs Bangladesh: క్రికెట్ అభిమానులకు మరో ఉత్కంఠభరితమైన సిరీస్ చూసే అవకాశం రాబోతోందా? ఇటీవలి టీ20 వరల్డ్ కప్ వివాదాలు, భద్రతా కారణాల వల్ల రద్దయ్యేలా కనిపించిన భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ వైట్ బాల్ సిరీస్‌పై సస్పెన్స్ త్వరలోనే వీడబోతోంది. 3 వన్డేలు, 3 టీ20ల ఈ పరిమిత ఓవర్ల సిరీస్ నిర్వహణకు సంబంధించి భారత ప్రభుత్వ అనుమతి కోరడానికి బీసీసీఐ (BCCI) సిద్ధమైంది. మరోవైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ టీమిండియాను తమ దేశానికి రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 

వివాదాల నుంచి మళ్లీ ఆశల వైపు: 
ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం భద్రతా నెపంతో తమ జట్టును భారత్‌కు పంపడానికి నిరాకరించడంతో బీసీబీ, బీసీసీఐల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఇటీవలి భౌగోళిక-రాజకీయ పరిణామాల వల్ల ఈ సిరీస్‌పై మళ్లీ ఆశలు చిగురించాయి. ప్రస్తుతం ఇరు జట్ల క్రికెట్ బోర్డులు నిరంతరం చర్చలు జరుపుతున్నాయి. దీంతో ఈ చర్చలు ఫలించి మళ్లీ సిరీస్ పట్టాలెక్కే అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది. 

* ప్రత్యేక విండో: బంగ్లాదేశ్ బోర్డు ఈ సిరీస్ కోసం ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ప్రత్యేక విండోను కేటాయించింది.

* కేంద్రం చేతిలోనే చివరి నిర్ణయం: మేము ఈ సిరీస్‌పై పని చేస్తున్నాం.. బంగ్లాదేశ్ టూర్‌పై కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి, స్పష్టత కోరతాం.. ఆఖరి నిర్ణయం భారత్ సర్కార్‌దే అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

* భద్రతపై తమీమ్ ఇక్బాల్ హామీ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ.. బంగ్లా అత్యంత సురక్షితమైన దేశం.. భారత్‌తో సిరీస్ అంటే ఇక్కడ ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. టీమిండియా పర్యటన కోసం నా పరిధిలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను అని తెలిపాడు. 

►ALSO READ | గిల్ గాయం టెన్షన్‌కు చెక్.. శ్రీలంకతో తొలి టెస్టుపై సస్పెన్స్‌కు ఎండ్?