తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు మాజీ సీఎం కేసీఆర్. 2026 ఆగస్టు 9వ తేదీన వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని పెద్ది స్వగృహానికి చేరుకున్నారు కేసీఆర్. దివంగత పెద్ది చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణంతో దిగ్ర్భాంతిలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు అండగా నిలవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ క్రమంలో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.
పెద్ది కుటుంబ సభ్యుల పరామర్శకు కేసీఆర్ వస్తున్నారని తెలిసి.. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడిన కేసీఆర్.. నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.
