లండన్: ఇండియా సంతతికి చెందిన బోధన శివానందన్.. చెస్ వరల్డ్ సంచలనం సృష్టించింది. సమర్‌కండ్‌లో జరుగుతున్న 46వ చెస్ ఒలింపియాడ్‌లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 11 ఏళ్ల బోధన అతిపిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదాను సాధించింది. ఇంగ్లండ్ తరఫున టాప్ బోర్డులో అన్ని రౌండ్లు ఆడిన బోధన మొత్తం 11 రౌండ్లలో 8 పాయింట్లు సాధించింది.
ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలైన క్రీడాకారిణిగా చెస్ సమాఖ్య (ఫిడే) ఈ రికార్డును ధ్రువీకరించింది. తొమ్మిదేళ్ల వయసులోనే ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ వేదికపై ప్రాతినిధ్యం వహించిన అతిపిన్న వయస్కురాలిగానూ బోధన రికార్డులకెక్కింది. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో తండ్రి ఇచ్చిన చెస్ బోర్డుతో ఈ ఆటను నేర్చుకున్న బోధన, ఎవరి సహాయం లేకుండానే ప్రతిభను మెరుగుపరుచుకుంది.
