ముషీరాబాద్, వెలుగు: ఆయిల్‌ఫెడ్ భూముల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో రూ.500 కోట్ల విలువైన 16 వేల గజాల స్థలాన్ని రూ.80 కోట్లకే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
సోమవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఆయిల్‌ఫెడ్ భూములను అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఆయిల్‌ఫెడ్ మాజీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, ముఠా జైసింహ, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సాగర్‌తో కలిసి దాసోజు శ్రవణ్ పరిశీలించి మాట్లాడారు.
బస్ భవన్ ఎదురుగా ఉన్న సుమారు 16 వేల గజాల ఆయిల్‌ఫెడ్ భూమిని సంస్థకే కేటాయించాలని డిమాండ్ చేశారు. 2026 మే 22న జారీ చేసిన జీవో 85 ద్వారా మరోసారి ప్రైవేట్ వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో ముచ్చకుర్తి ప్రభాకర్, సోమన్, శ్రీనివాస్‌రెడ్డి, శివ ముదిరాజ్, రోషం మల్లేశ్ పాల్గొన్నారు.
