Shubman Gill: అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 10 సెంచరీల మైలురాయిని అందుకున్న ప్రపంచ స్థాయి బ్యాటర్ల జాబితాను తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసింది. ఈ జాబితాలో భారత వన్డే టీమ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.
మూడో స్థానంలో గిల్, ఫఖర్ జమాన్:
ఆదివారం (సెప్టెంబర్ 27) జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత వన్డే సారథి శుభ్‌మన్ గిల్.. వన్డేల్లో తన 10వ సెంచరీని పూర్తి చేసుకున్నారు. దీంతో అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 10 సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అతడు మూడో స్థానానికి ఎగబాకారు. పాకిస్థాన్ ఆటగాడు ఫఖర్ జమాన్‌తో కలిసి గిల్ ఈ స్థానాన్ని సంయుక్తంగా షేర్ చేసుకుంటుండగా, వీరిద్దరూ కేవలం 67 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నారు.
అగ్రస్థానంలో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్:
ఈ రికార్డు జాబితాలో సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. వన్డేల్లో అత్యంత వేగంగా 10 సెంచరీలు కొట్టిన రికార్డు డి కాక్ పేరు మీదే ఉంది. ఆయన కేవలం 55 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను సాధించారు. క్వింటన్ డి కాక్ తర్వాతి స్థానంలో, సౌతాఫ్రికా దిగ్గజం హషీమ్ ఆమ్లా నిలిచారు. హషీమ్ ఆమ్లా 57 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. అలాగే పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ 68 ఇన్నింగ్స్‌లతో ఈ జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
