ఆస్ట్రేలియాతో వన్డేలో.. మిల్లర్‌‌‌‌‌‌‌‌, బవుమా సెంచరీలు.. సౌతాఫ్రికా విజయం..

ఆస్ట్రేలియాతో వన్డేలో.. మిల్లర్‌‌‌‌‌‌‌‌, బవుమా సెంచరీలు.. సౌతాఫ్రికా విజయం..

జొహనెస్‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌: కెప్టెన్‌‌‌‌‌‌‌‌ టెంబా బవుమా (103), డేవిడ్‌‌‌‌‌‌‌‌ మిల్లర్‌‌‌‌‌‌‌‌ (142) సెంచరీలతో దంచికొట్టడంతో.. ఆదివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 32 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 365/9 స్కోరు చేసింది. 

మాథ్యూ బ్రీట్జ్‌‌‌‌‌‌‌‌కే (34), డువాన్‌‌‌‌‌‌‌‌ జాన్సెన్‌‌‌‌‌‌‌‌ (27 నాటౌట్‌‌‌‌‌‌‌‌) ఫర్వాలేదనిపించారు. జాక్‌‌‌‌‌‌‌‌ ఎడ్వర్డ్స్‌‌‌‌‌‌‌‌ 5, హాజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ 3 వికెట్లు తీశారు. తర్వాత ఆసీస్‌‌‌‌‌‌‌‌ 49.5 ఓవర్లలో 333 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. మిచెల్‌‌‌‌‌‌‌‌ మార్ష్‌‌‌‌‌‌‌‌ (84), ట్రావిస్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ (84), జేవియర్‌‌‌‌‌‌‌‌ బార్ట్‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌ (50) హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీలు చేసినా ప్రయోజనం దక్కలేదు. 

మ్యాట్‌‌‌‌‌‌‌‌ రెన్‌‌‌‌‌‌‌‌షా (32), జాక్‌‌‌‌‌‌‌‌ ఎడ్వర్డ్స్‌‌‌‌‌‌‌‌ (25) పోరాడి విఫలమయ్యారు. లిజాద్‌‌‌‌‌‌‌‌ విలియమ్స్‌‌‌‌‌‌‌‌ 3 వికెట్లు పడగొట్టాడు. మిల్లర్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య పాచెఫ్‌‌‌‌‌‌‌‌స్ట్రూమ్‌‌‌‌‌‌‌‌లో బుధవారం మూడో వన్డే జరుగుతుంది.