గచ్చిబౌలి, వెలుగు: గిగ్, డెలివరీ కార్మికుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం, అమెజాన్ ఇండియా భాగస్వామ్యంతో కొండాపూర్‌లో ‘ఆశ్రయ’ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) కమిషనర్ సోమవారం దీనిని ప్రారంభించారు.
పని సమయంలో కార్మికులు కొంతసేపు విశ్రాంతి తీసుకోవడంతో పాటు రీఛార్జ్ అయ్యేందుకు, ప్రాథమిక సౌకర్యాలను వినియోగించుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మార్గదర్శకత్వంలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏ కంపెనీ లేదా డెలివరీ ప్లాట్‌ఫామ్‌కు చెందిన వారైనా ఈ కేంద్రాన్ని వినియోగించుకోవచ్చు.
