ఇరాన్ ను బెదిరిద్దామనుకున్న ఇజ్రాయెల్, అమెరికాకు రివర్స్ అటాక్ ఎదురవుతోంది. ఇరాన్ ఎక్కడా తగ్గకుండా.. ఏదైతే అది అన్నట్లుగా డ్రోన్స్, మిస్సైల్స్ తో విరుచుకుపడుతోంది. మొదట చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాలలో ఉన్న యూఎస్ బేస్ లపై దాడులు చేసిన ఇరాన్.. ఆ తర్వాత అలాంటి నిబంధనలేవీ లేకుండా డ్రోన్స్ విసురుతోంది. 2025 ఫిబ్రవరి 28న కువైట్ ఎయిర్ పోర్ట్ పై డ్రోన్ తో దాడి చేసింది. దీంతో ఎయిర్ పోర్టు తుక్కుతుక్కయింది.
ఒక్కసారిగా డ్రోన్ పడటంతో విమానాశ్రయం చాలా భాగం కూలిపోయింది. దాదాపు ధ్వంసమైపోయింది. భారీ శబ్దంతో డ్రోన్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రయాణికు, సిబ్బంది బయటకు పరుగులు తీవారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారినిన ట్రీట్మెంట్ కోసం దగ్గరలో ఉన్న ఆస్పత్రులలో జాయిన్ చేశారు. గాయపడ్డవారికి వైద్య సహాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అదే విధంగా దుబాయి పైన కూడా ఇరాన్ మిస్సైల్స్ తో విరుచుకుపడింది. దుబాయి లో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించినట్లు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. పామ్ ఐలెండ్ లో పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపించినట్లు వెల్లడించింది. ఇరాన్ దాడులు చేస్తున్న క్రమంలో ఎయిర్ పోర్టును మూసి వేసింది దుబాయి.
మరోవైపు ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులలో మినాబ్ సిటీలోని ఎలిమింటరీ గర్ల్స్ స్కూల్ ధ్వంసమైంది. ఈ పేలుళ్లో మృతి చెందిన విద్యార్థినుల సంఖ్య 80 కి చేరుకుంది.
మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న పరిణామాలపై ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. రాత్రికి సెక్యూరిటీ కౌన్సిల్ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేయనుంది. మరోవైపు పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ అమెరి అధ్యక్షుడు ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
BREAKING 🚨🇰🇼🇮🇷: Situation at Kuwait International Airport following Iranian drone strike — operations disrupted, security heightened.#Kuwait #Iran #Breaking #Airport pic.twitter.com/Cg8vhJECn2
— Global Flash Alert (@GlobalFlashHQ) February 28, 2026
