హైదరాబాద్ సిటీలో వాన దంచికొట్టింది. మంగళవారం(జూలై21) సిటీలో దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాలో భారీ వర్షం కురవగా మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సిటీలోని చాలా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మంగళవారం సాయంత్రం సిటీలోని దిల్ సుఖ్నగర్, కొత్తపేట, మలక్పేట, సైదాబాద్, కర్మన్ ఘాట్,చాదర్ ఘాట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అదేవిధంగా ఎల్బీనగర్,వనస్థలిపురం,నాగోల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది.బషీర్ బాగ్, అబిడ్స్, హిమాయత్ నగర్ , నారాయణగూడ , కోఠి , ముషీరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం పడింది.
పంజాగుట్ట, అమీర్ పేట్, ఎర్రమంజిల్ లో భారీ వర్షం కురవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి అమీర్ పేట్ వరకు రెడ్డుకు ఇరువైపుల పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరోవైపు బోడుప్పల్, పీర్జాదిగూడ ,ఉప్పల్ ప్రాంతాలలో కూడా మోస్తరు వర్షం కురిసింది. సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ప్యాట్నీ సెంటర్, పారడైజ్,వెస్ట్ మారేడు పల్లిలో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా ఉప్పల్లో కమ్యూటర్ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం ఓ వైపు.. గుంతల రోడ్డు ఉప్పల్ లో వాహనదారులు ముందుకు కదలడమే కష్టంగా మారింది.
