Rain Alert: దేశాన్ని కమ్మేస్తున్న మేఘాలు.. తెలంగాణలో వర్షాలపై ఇస్రో, ఐఎండీ ఏం చెబుతుందంటే..

Rain Alert: దేశాన్ని కమ్మేస్తున్న మేఘాలు.. తెలంగాణలో వర్షాలపై ఇస్రో, ఐఎండీ ఏం చెబుతుందంటే..

దేశంలో రుతుపవనాలు మళ్లీ బలపడుతున్నాయి. దేశంలో 70 శాతం మేఘాలు కమ్ముకున్నాయని  ఇస్రో శాటిలైట్స్, ఐఎండీ విశ్లేషిస్తోంది.ఇవి సాధారణ మేఘాలు కావని రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయిన అంచనా వేశాయి. తీరప్రాంత రాష్ట్రాల్లో మేఘాల ఉష్ణోగ్రతలు భారీ ఎత్తున పడిపోయాయి.. ఈ మేఘాలు పైపైకి వెళ్తున్నందున మరింత చల్లబడి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నాయి.  ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లో భారీనుంచి అతిభారీ వర్షాలు, దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఏపీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఇస్రో, ఐఎండీ అంచనా వేశాయి. 

ఇస్రో తాజా ఉపగ్రహ చిత్రాలు, భారత వాతావరణ శాఖ (IMD) విశ్లేషణ ప్రకారం దేశంలో 70 శాతానికి పైగా ప్రాంతం దట్టమైన మేఘాల అలముకున్నాయి. బంగాళాఖాతం నుంచి ఉత్తర భారతదేశం వరకు భారీ వర్ష మేఘాలు విస్తరించగా, పలు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌కు రెడ్ అలర్ట్, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో వర్షాల తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఐఎండీ అంచనా ప్రకారం..మరో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు వాయువ్య, ఈశాన్య భారతదేశంతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మేఘాల విస్తీర్ణం మారుతూ ఉన్నా, వాటి తీవ్రత మాత్రం పెరుగుతోందని ఉపగ్రహ చిత్రాలు స్పష్టంగా సూచిస్తున్నాయి.

రెడ్ అలర్ట్ : హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలకు అత్యంత భారీ వర్షాల కురుస్తాయని  రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. 
ఆరెంజ్ అలర్ట్ : ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 

ALSO READ : తెలంగాణలో 25 జిల్లాల్లో తీవ్ర లోటు వర్షపాతం

ఉరుములు -మెరుపులతో భారీవర్షాలు: అండమాన్ నికోబార్, ఒడిశా, జార్ఖండ్, రాజస్థాన్, తెలంగాణాలో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది.