ఆపిల్ కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన అత్యంత ఖరీదైన 'ఐఫోన్ 18 ప్రో' దక్కించుకునేందుకు దేశవ్యాప్తంగా టెక్కీలు, ఆపిల్ లవర్స్ క్యూ కట్టారు. అయితే నోయిడాలోని డీఎల్‌ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న ఆపిల్ స్టోర్ బయట లైన్లో నిలబడిన ఒక వ్యక్తి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
తన భార్య కోరిక మేరకు ఆమెకు ఐఫోన్ 18 ప్రో కొనేందుకు తాను తన కుటుంబానికి తరతరాలుగా వస్తున్న బంగారాన్ని అమ్మేసినట్లు మీడియా ముందు చెప్పాడు. దీనిపై ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంక స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి. అసలు భారతీయులకు బంగారంపై ఉన్న ఆలోచనలు, విలువ వంటి అంశాలపై కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.
Some people sell gold to buy a house. Some sell it for their children’s future. This Delhi man sold family gold passed down from his grandmother and great-grandmother to buy his wife an iPhone 18 Pro Max.🙈 https://t.co/MVSUEtmfSB
— Harsh Goenka (@hvgoenka) September 18, 2026
హర్ష గోయంక కామెంట్స్:
ఐఫోన్ కోసం గోల్డ్ అమ్మేసినట్లు వ్యక్తి చెప్పిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంక ఎక్స్ లో షేర్ చేశారు. ఈ క్రమంలో మనుషుల ప్రాధాన్యతలు, బంగారం విలువ గురించి చాలా లోతైన వ్యాఖ్యలు చేశారు. కొందరు వ్యక్తులు తమ సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం బంగారం అమ్ముతారని, మరికొంతమంది తమ పిల్లల భవిష్యత్తు, చదువుల కోసం గోల్డ్ విక్రయిస్తారన్నారు గోయంక. కానీ ఈ దిల్లీ వ్యక్తి మాత్రం తన అమ్మమ్మ, ముత్తమ్మల నాటి వారసత్వపు బంగారాన్ని భార్య కోసం ఐఫోన్ 18 ప్రో మాక్స్ కొనేందుకు అమ్మేయటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గోయంక చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై నెటిజన్ల నుంచి రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయ్.
నెటిజన్ల నుంచి విమర్శలు:
హర్ష గోయంక షేర్ చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొందరైతే ఇది పూర్తిగా తప్పుడు నిర్ణయమని, విలువ పెరిగే బంగారాన్ని ఇచ్చి.. కొన్న కొన్ని సంవత్సరాలకే విలువ కోల్పోయే మొబైల్ ఫోన్‌ను తీసుకోవటం సరికాదని మండిపడ్డారు. ఎమోషన్స్ కలిగిన ఫ్యామిలీ జ్యువెలరీని కేవలం ఒక ఫోన్ కోసం అమ్మేయడం సరికాదని మరికొందరు విమర్శించారు. అయితే మరికొంతమంది మాత్రం ఇతరుల వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేయడం మానేసి, ఎవరి డబ్బును ఎలా ఖర్చు చేసుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికి ఉంటుందని సమర్థించారు.
►ALSO READ | సమ్మేపై కస్టమర్లను అలర్ట్ చేసిన SBI.. వచ్చేవారం వరుసగా 5 రోజులు క్లోజ్
