టోక్యో: జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతోన్న ఆసియా గేమ్స్ 2026లో భారత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) అథ్లెట్ సుచిక తరియాల్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏసియన్ గేమ్స్ చరిత్రలోనే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో భారతదేశానికి పతకం (కాంస్య) అందించిన తొలి అథ్లెట్‌గా హిస్టరీ క్రియేట్ చేసింది. సెమీస్ పోరులో భాగంగా సోమవారం (సెప్టెంబర్ 21) మహిళల 60 కేజీల విభాగంలో సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియోతో సుచిక తలపడింది.
చివరి వరకు హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డారు. దీంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా రౌండ్ (ఓవర్‌టైమ్) దారి తీసింది. చివరకు నిర్ణయం సింగపూర్ క్రీడాకారిణికి అనుకూలంగా రావడంతో సుచిక కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎంఎంఏ విభాగంలో ఇండియాకు తొలి మెడల్ అందించిన సుచికాకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మల్టి టాలెంటెడ్ సుచికా:
ఆసియా గేమ్స్‌లో ఎంఎంఐ ఈవెంట్లో భారత్‌కు తొలి పతకం అందించిన 36 ఏళ్ల సుచికా మల్టిటాలెంటెడ్ అథ్లెట్. కేవలం ఎంఎంలోనే కాకుండా గతంలో జూడో (8 సార్లు జాతీయ ఛాంపియన్), జు-జిట్సు (ప్రపంచ ఛాంపియన్), కురాష్ క్రీడలలో కూడా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది.
ఈసారే ఎంఎంఏ ఎంట్రీ:
ఆసియా గేమ్స్‌లో ఈసారే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) క్రీడను అధికారిక మెడల్ ఈవెంట్‌గా చేర్చారు. ఇప్పటి వరకు ఆసియా గేమ్స్‌లో ఎంఎంఏ ఈవెంట్ లేదు. సో.. ఎంఎంఐ విభాగంలో భారత్ తరఫున పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా సుచికా తరియాల్ పేరు నిలిచిపోనుంది.
►ALSO READ | డేవిస్ కప్ నుంచి భారత్ ఔట్
