ఎల్‌నినో ప్రభావంతో జూన్ నుంచి ఇప్పటివరకు తెలంగాణలోని ఏకంగా 25 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ ఐఎండీ డైరెక్టర్ స్టెల్లా వెల్లడించారు.. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయని తెలిపారు. (00:25 - 00:40)
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడమే ఈ ఎల్‌నినోకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. జూలై నెలలో కూడా వర్షపాతం లోటుగానే ఉండే అవకాశం ఉందని, దక్షిణ జిల్లాల్లో మాత్రమే అక్కడక్కడా కొంత వర్షం కురిసే సూచనలు ఉన్నాయని స్పష్టం చేశారు.
ఆగస్టులో వర్షాభావం కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. సెప్టెంబర్‌లో వర్షాలు మరింత తక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉందని డైరెక్టర్ స్టెల్లా హెచ్చరించారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ వర్షాలు లేక ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు తగ్గిపోయాయని చెప్పారు. ఈ క్రమంలో రుతుపవనాల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ ఐఎండీ తెలిపింది.
