ఆధార్ కార్డ్‌తో పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చా ? రూపాయి ఖర్చు లేకుండా ఎలా పొందొచ్చు అంటే..

ఆధార్ కార్డ్‌తో పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చా ? రూపాయి ఖర్చు లేకుండా ఎలా పొందొచ్చు అంటే..

మీ ఆధార్ నంబర్‌  ఉపయోగించి పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకవచ్చా... దినికి సమాధానం అవును,...... కొన్నిసార్లు, మీరు అధికారిక ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఆధార్‌ను ఉపయోగించి ఇ-పాన్‌ను పొందవచ్చు లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, ఈ ప్రక్రియ మీకు ఇప్పటికే పాన్ ఉందా లేదా కొత్త దాని కోసం అప్లయ్ చేసుకుంటున్నారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

ఆదాయపు పన్ను శాఖ, ఇంకా పాన్ కేటాయించబడని అర్హులైన వ్యక్తులు ఆధార్ సహా ఆధార్‌తో అనుసంధానించిన మొబైల్ నంబర్‌ను ఉపయోగించి, ఎలక్ట్రానిక్‌గా డిజిటల్ సంతకంతో కూడిన పాన్‌ను పొందేందుకు వీలుగా ఇన్స్టంట్ ఇ-పాన్ ఫెసిలిటీ అందిస్తోంది. ఈ సర్వీస్  ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండగా  పూర్తిగా ఉచితం కూడా.

మీకు ఇప్పటికే పాన్ ఉండి, మీ ఫిజికల్ పాన్ కార్డ్‌ పోగొట్టుకున్నట్లయితే, మరొక పాన్ కోసం దరఖాస్తు చేయడానికి ఇన్‌స్టంట్ ఇ-పాన్ సదుపాయాన్ని ఉపయోగించవద్దు. దానికి బదులుగా, మీరు సంబంధిత పాన్ సర్వీస్ ద్వారా మీ ప్రస్తుత పాన్ వివరాలను పొందాలి/డౌన్‌లోడ్ చేసుకోవాలి .

 ఆధార్ ఉపయోగించి ఇ-పాన్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎవరు అర్హులు, అవసరమైన డాక్యూమెంట్స్, OTP ప్రక్రియ, మీకు ఇప్పటికే పాన్ ఉంటే ఏమి చేయాలి అనే వివరాలకు సమాధానాల గురించి మీకోసం....

 మీ దగ్గర ఆధార్ నంబర్ ఉంటే, ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) అధికారిక వెబ్‌సైట్ ద్వారా పాన్ కార్డును (e-PAN) ఫ్రీగా  పొందవచ్చు. అయితే, మీరు కొత్తగా పాన్ కార్డ్ తీసుకుంటున్నారా లేక పాత కార్డ్ పోయి మళ్లీ డౌన్‌లోడ్ చేస్తున్నారా అనే దాన్ని బట్టి రూల్స్  మారతాయి.

 మీకు ఇంతకుముందు పాన్ కార్డ్ లేకపోతే...  కొత్తగా దరఖాస్తు చేసేవారికి... మీరు ఆదాయపు పన్ను శాఖ ఇచ్చే "Instant e-PAN" సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. దీనికి మీ ఆధార్ నంబర్, అలాగే ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్ ఉంటే చాలు. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం ఇంకా డిజిటల్ సంతకంతో ఇ-పాన్ కార్డ్ (PDF) ఇన్స్టంట్ లభిస్తుంది.

►ALSO READ | భార్యకు ఐఫోన్ 18 ప్రో కొనేందుకు ఫ్యామిలీ గోల్డ్ సేల్.. వ్యాపారి హర్ష గోయంక షాకింగ్ కామెంట్స్!

 మీకు ఇప్పటికే పాన్ కార్డ్ ఉండి, అది పోయినట్లయితే... మరో కొత్త పాన్ కోసం దరఖాస్తు చేయకూడదు: "Instant e-PAN" సర్వీస్ కేవలం కొత్తగా పాన్ కార్డ్ తీసుకునే వారి కోసం మాత్రమే. అలాగే రెండు పాన్ కార్డ్ తీసుకోవడం నేరం. అంటే  ఒకే వ్యక్తికి రెండు పాన్ కార్డులు ఉంటే చట్టరీత్యా జరిమానా పడుతుంది.

పాత పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?: 
మీ పాత పాన్ కార్డ్ పోతే, NSDL (Protean) లేదా UTIITSL పోర్టల్స్ ద్వారా మీ పాత పాన్ వివరాలను ఇచ్చి రీ-ప్రింట్ లేదా డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఆధార్‌తో కొత్త ఇ-పాన్ కోసం :
*ముందుగా ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ (Income Tax e-Filing) పోర్టల్‌ ఓపెన్ చేసి, Quick Links విభాగంలో Instant e-PAN పై క్లిక్ చేయండి.
*ఇప్పడూ అక్కడ కనిపించే Get New e-PAN బటన్‌ను సెలెక్ట్ చేసుకోండి.
*ఇప్పుడు  మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్   చేయండి.
* ఇక మీ ఆధార్‌కి లింక్ అయిన మొబైల్‌కి ఒక OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసి వెరిఫై చేయండి. 
*ఆధార్ వివరాలను సరిచూసుకుని అంగీకరించాలి. అవసరమైతే డిజిలాకర్ ద్వారా పుట్టిన తేదీకి సంబంధించిన ప్రూఫ్‌ను ధృవీకరించాల్సి ఉంటుంది.
*ఈ  ప్రక్రియ పూర్తయ్యాక మీకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ (Acknowledgement Number) వస్తుంది.
*కొద్దిసేపటి తర్వాత మళ్లీ అదే పేజీకి వచ్చి Check Status / Download PAN పై క్లిక్ చేసి, OTP ఎంటర్ చేసి మీ e-PAN (PDF) ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.