హైదరాబాద్: ట్యాంక్ బండ్ దగ్గర భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ట్యాంక్ బండ్పై గణేష్ నిమజ్జనాన్ని నిషేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధులు తొలగించారు. దీంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా పోలీసుల మోహరించారు. ట్యాంక్‌బండ్‌పై నుంచి గణేశ్ విగ్రహాల నిమజ్జనం అంశం మరోసారి వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్‌బండ్‌పై నుంచి నిమజ్జనాలకు అనుమతి లేదని జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్ పై నుంచి విగ్రహాలు వేయకుండా10 ఫీట్ల రెయిలింగ్ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్మార్గ్, పీపుల్స్‌ప్లాజా, నెక్లెస్‌రోడ్‌లలో ఏర్పాటు చేస్తున్న క్రేన్ల నుంచి కేవలం మట్టి, పర్యావరణ హిత విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేస్తామని చెప్తున్నారు. అలాగే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్విగ్రహాలను నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన బేబీ పాండ్లలోనే నిమజ్జనం చేయాలని సూచిస్తున్నారు.
►ALSO READ | హైదరాబాద్ సిటీకి ఎల్ నినో గండం.. మంచి నీటి కష్టాలు తప్పవు
ట్యాంక్‌బండ్‌పై నుంచి నిమజ్జనం లేదని అధికారులు ప్రకటించడాన్ని గణేశ్ఉత్సవ సమితి తీవ్రంగా వ్యతిరేకించింది. ట్యాంక్‌బండ్ సంప్రదాయ నిమజ్జన ప్రాంతమని, అక్కడే విగ్రహాలను నిమజ్జనం చేస్తామని తెగేసి చెప్పింది. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని, లేకపోతే తామే తీసేసి నిమజ్జనాలు చేస్తామని హెచ్చరించింది.
