హైదరాబాద్ లో సామాన్యులకు గుడ్ న్యూస్ : 224 రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్

హైదరాబాద్ లో  సామాన్యులకు గుడ్ న్యూస్ : 224 రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్
  • బండ్లగూడ, పోచారంలో 224 ఫ్లాట్లు అందుబాటులో

హైదరాబాద్, వెలుగు: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బండ్లగూడ, పోచారంలోని ఖాళీ ఫ్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోచారంలో 141 సింగిల్ బెడ్‌‌‌‌రూమ్, 78 డబుల్ బెడ్‌‌‌‌రూమ్, బండ్లగూడలో 5 సింగిల్ బెడ్‌‌‌‌రూమ్ ఫ్లాట్లు కలిపి మొత్తం 224 ఫ్లాట్లను విక్రయానికి ఉంచినట్లు కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. సింగిల్ బెడ్‌‌‌‌రూమ్ ఫ్లాట్ ధర రూ.13 లక్షలు, డబుల్ బెడ్‌‌‌‌రూమ్ ఫ్లాట్ ధర రూ.19 లక్షలుగా నిర్ణయించినట్లు వెల్లడించారు.

దరఖాస్తులు మీ సేవ కేంద్రాల ద్వారా స్వీకరిస్తున్నట్లు చెప్పారు. హెచ్‌‌‌‌ఎండీఏ  పరిధిలో సొంత ఇల్లు లేదా ప్లాట్ లేని వారే అర్హులని పేర్కొన్నారు. సింగిల్ బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌కు రూ.1 లక్ష, డబుల్ బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌కు రూ.2 లక్షలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అర్హతలు పరిశీలించి, ముందుగా దరఖాస్తు చేసిన వారికి ఫ్లాట్లు కేటాయిస్తామని ఎండీ వెల్లడించారు.