కరీంనగర్: కరీంనగర్లో అర గంట భారీ వర్షం కురిసింది. మంకమ్మ తోట రోడ్ నెంబర్.1లో కాలనీ నీట మునిగింది. స్థానిక వరద నీరంతా కాలనీలో రావడంతో జనం ఇక్కట్లు వర్ణనాతీతం. ప్రతి సంవత్సరం వర్షం పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. తమ కాలనీకి వరద నీరు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ ముకరంపురలో డ్రైనేజీ పొంగడంతో కాలనీని వరద నీరు ముంచెత్తింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు దోమకొండ, బీబీపేట్, మాచారెడ్డి, బిక్కనూర్, రాజాంపేట మండలాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ ఉరుముల కారణంగా ప్రజలు భయాందోళనకి లోనవుతున్నారు.
ALSO READ : హైదరాబాద్ పబ్లిక్.. నిమజ్జనంలో ఫుల్ బిజీ ఉన్నారా..?
భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతంలో భారీ ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది.
