కరీంనగర్: జిల్లాలో దుండగులు ఏటీఎంలను టార్గెట్ చేశారు. ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఏటీఎంలను ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు. దుర్శేడు, తిమ్మాపూర్‌లో జరిగిన ఈ ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి.తిమ్మాపూర్ స్టేజీ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంను అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు ఏటీఎం ధ్వంసమై ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దుండగులు ముందుగా ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాలకు నల్లటి స్ప్రే కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేసి నగదును తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఏటీఎంలో సుమారు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నగదు ఉండే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.
దుండగులు స్కార్పియో వాహనంలో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఏటీఎం లోపల ఉన్న సీసీ కెమెరాలను కట్ చేసి, కేవలం ఎనిమిది నిమిషాల్లో చోరీ పూర్తి చేసినట్లు సమాచారం. అయితే ఏటీఎం బయట ఏర్పాటు చేసిన సీసకి పాల్పడ్డారు. అక్కడ కూడా సీసీ కెమెరాలపై స్ప్రే చల్లి ఏటీఎంను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వారిలో ఒకరు మహిళ ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. నిందితులు తలకు టోపీ, కళ్లద్దాలు, ముసుగు ధరించి ఉన్నట్లు సీసీ కెమెరాల దీ కెమెరాల్లో దుండగుల కదలికలు, వాహనానికి సంబంధించిన దృశ్యాలు నమోదయ్యాయి.
దుర్శేడులోని మరో ఏటీఎంలోనూ దుండగులు ఇదే తరహాలో చోరీకి పాల్పడ్డారు. అక్కడ కూడా సీసీ కెమెరాలపై స్ప్రే చల్లి ఏటీఎంను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.దుర్శేడు ఘటనలో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నట్లు, వారిలో ఒకరు మహిళ ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. నిందితులు తలకు టోపీ, కళ్లద్దాలు, ముసుగు ధరించి ఉన్నట్లు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా తెలుస్తోంది.
ఒకేరోజు రెండు ఏటీఎంల్లో చోరీలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు ఘటనలకు ఒకే ముఠా కారణమా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ, వాహనం వివరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
