మరిపెడలో నూతన కోర్టు ప్రారంభం.. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించేలా చర్యలు

మరిపెడలో నూతన కోర్టు ప్రారంభం..  పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించేలా చర్యలు

మరిపెడ, వెలుగు : మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో శనివారం జూనియర్ సివిల్ జడ్జి కం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఈ.వి.వేణుగోపాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు, జస్టిస్ మధుసూదన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టు ఏర్పాటుతో స్థానిక కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు సత్వర న్యాయం అందే అవకాశం ఏర్పడిందన్నారు. 

గతంలో చిన్నచిన్న న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి మహబూబాబాద్, తొర్రూరు కోర్టులకు వెళ్లాల్సి వచ్చేదని తెలిపారు. మరిపెడ సర్కిల్ పరిధిలో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి మురళి మోహన్, కలెక్టర్ స్నేహ శబరీశ్, ఎస్పీ డా.శబరీశ్, ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి జడ్జి ధీరజ్ కుమార్, న్యాయవాదులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.