సినిమా (CINEMA) అంటే కేవలం కెమెరా ముందు కనిపించే కథ కాదు.. దాని వెనుక ఎన్నో ఏళ్ల కలలు, కష్టాలు, స్నేహాలు, ఎదురుచూపులు ఉంటాయి. అలాంటి ఓ అందమైన ప్రయాణానికి సాక్ష్యంగా నిలిచింది ‘ఇట్లు అర్జున’ టీజర్ లాంచ్ ఈవెంట్. ఈ కార్యక్రమంలో దర్శకురాలు మానస శర్మ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
మానస శర్మకు.. దర్శకుడు మహేష్ ఉప్పాలతో ఉన్న స్నేహం ఇప్పటిది కాదు. వీరిద్దరూ టెన్త్ క్లాస్ నుంచే బెస్ట్ ఫ్రెండ్స్. అప్పుడే సినిమాలపై ఆసక్తి పెంచుకున్న వీరిద్దరూ.. భవిష్యత్తులో సినిమాలు చేయాలనే కలలు కన్నారు. అయితే ఆ కలను చేరుకునే ప్రయాణం మాత్రం అనుకున్నంత సులభంగా సాగలేదు.
చదువు పూర్తయ్యాక కాలేజీ రోజులు, ఆ తర్వాత ఉద్యోగాలు.. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు.. ఇలా ఇద్దరి జర్నీలు వేర్వేరు దారుల్లో సాగాయి. అయినా వారి స్నేహం మాత్రం ఎక్కడా బ్రేక్ కాలేదు. సంవత్సరాలు మారినా.. పరిస్థితులు మారినా.. కలిసి సినిమాలు చేయాలనే ఆ కల మాత్రం ఇద్దరి మనసుల్లో అలాగే ఉంది.
ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న డైరెక్టర్ మానస శర్మ.. మహేష్ తనకు కేవలం స్నేహితుడు మాత్రమే కాదని, తనతో కలిసి సినిమా కలలు కన్న వ్యక్తి అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే స్నేహితుడు దర్శకుడిగా ఓ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూనే మానస శర్మ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తన స్నేహితుడి సినిమా కోసం ఇంత ఎమోషనల్ అవుతున్నానని చెప్పుకుంటూ నవ్వినా.. కళ్లలో మాత్రం ఆనందభాష్పాలు కనిపించాయి. ‘నా రాకాసి సినిమా విషయంలో కూడా ఇంతగా ఎమోషనల్ కాలేదేమో’ అంటూ సరదాగా చెప్పడంతో అక్కడున్నవారంతా నవ్వారు. అదే సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం ఈ ఈవెంట్‌లో ప్రత్యేకమైన మూమెంట్‌గా మారింది.
Additional screenplay writer of #ItlluArjuna and talented director #ManasaSharma emotional speech at teaser launch event 🤩💥
— What Next Entertainments (@WhatNextEnts) September 19, 2026
Watch Live here!
— https://t.co/FRzsxoDj43
Teaser Out Shortly 🔥
A @MusicThaman Musical 🎹@anieshforyou #AnaswaraRajan @itsmaheshuppala… pic.twitter.com/w0525MvHmR
‘ఇట్లు అర్జున’పై ఆసక్తి ఎందుకంటే..
మహేష్ ఉప్పాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇట్లు అర్జున’ సినిమా టీజర్‌తోనే ఆసక్తిని పెంచుతోంది. కొత్త తరహా కథ, యూత్‌ను ఆకట్టుకునే ట్రీట్‌మెంట్‌తో ఈ సినిమా రూపొందుతున్నట్లు చిత్రబృందం చెబుతోంది. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మూవీ టీమ్ చెప్పిన విషయాలు సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమా వెనుక ఉన్న స్నేహం, ఎన్నేళ్లుగా కొనసాగిన ప్రయాణం ఇప్పుడు సినిమాగా మారడం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఒకప్పుడు టెన్త్ క్లాస్‌లో కూర్చొని సినిమాలు తీయాలని కలలు కన్న ఇద్దరు స్నేహితుల్లో ఒకరు దర్శకురాలిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా.. మరొకరు ఇప్పుడు ‘ఇట్లు అర్జున’తో దర్శకుడిగా తన కలను తెరపైకి తీసుకొస్తున్నారు.
The captain of the ship, the most talented debut director @itsmaheshuppala speech at #ItlluArjuna teaser launch event 🎤💥
— What Next Entertainments (@WhatNextEnts) September 19, 2026
Watch Live here!
— https://t.co/FRzsxoDj43
Teaser Out Shortly 🔥
A @MusicThaman Musical 🎹@anieshforyou #AnaswaraRajan @VenkyKudumula @rajamahadhevan… pic.twitter.com/uORGeVRHYP
అందుకే మానస శర్మ ఎమోషన్‌లో కేవలం ఓ స్నేహితుడి సినిమా ఆనందం మాత్రమే లేదు.. ఇన్నేళ్ల క్రితం మొదలైన ఓ కల నిజమైన క్షణం కూడా ఉంది. టెన్త్ క్లాస్‌లో మొదలైన ఆ కల.. ఎన్నో మలుపులు దాటి.. ఇప్పుడు వెండితెరపై ఓ కథగా రూపుదిద్దుకోవడం నిజంగానే ఓ సినిమాటిక్ జర్నీ అని చెప్పొచ్చు.
