Suryakumar Yadav: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ (MI) జట్టును వీడుతున్నాడంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కొనసాగుతోంది. గతేడాదిన్నరగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుండటం, కెప్టెన్సీ ఆఫర్ కోసమే సూర్య వేరే ఫ్రాంచైజీకి వెళ్తున్నాడని వచ్చిన వార్తలపై తాజాగా సూర్య భాయ్ నోరు విప్పాడు. తనపై వస్తున్న పుకార్లన్నింటికీ తెరదించాడు.
ఎందుకు తప్పుకుంటా? నా బ్లడ్ గ్రూప్ బ్లూ:
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో చేరి ప్లేయర్లను కలవడం నాకు ఎప్పుడూ రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. ముంబైతో నా ప్రయాణం 10వ ఏటకి చేరుతోంది. ఒకవేళ నా బ్లడ్ చెక్ చేసినా అది ముంబై ఇండియన్స్ కలర్ అయిన బ్లూలోనే ఉంటుందని సరదాగా చెప్పుకొచ్చాడు. ఎంఐ జట్టు కేవలం ఒక క్రికెట్ ఫ్రాంచైజీ మాత్రమే కాదని, ఒక విద్యాసంస్థ లాంటిదన్నాడు. ఆటగాళ్ల క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధి కోసం ఏడాది పొడవునా అక్కడ పని చేసే అద్భుతమైన సదుపాయాలు ఉన్నాయని స్కై చెప్పుకొచ్చాడు.
ధోనీ, రోహిత్, విరాట్ కాదు.. ఆ బుడ్డోడి సిక్సర్ల స్కిల్ దొచుకుంటా:
ఇతర క్రికెటర్ల నుంచి ఏదైనా ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని ఎంచుకోవాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారనే ప్రశ్నకు సూర్యకుమార్ యాదవ్ చెప్పిన సమాధానం అందరినీ షాక్ కి గురి చేసింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, ఏబీ డివిలియర్స్ లాంటి దిగ్గజాలను పక్కనపెట్టి, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పేరును స్కై చెప్పాడు. మీరంతా వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడి గురించి వినే ఉంటారు.. అతడు నమ్మశక్యం కాని రీతిలో కొట్టే సిక్సర్ల నైపుణ్యాన్ని నేను కచ్చితంగా దొంగిలిస్తానని తెలిపాడు.
వైభవ్ ఊచకోత.. సూర్య నిరాశ:
* వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: 16 మ్యాచ్‌ల్లో 237.31 మైండ్ బ్లాకింగ్ స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. టోర్నీలో ఏకంగా 72 సిక్సర్లు కొట్టి మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
►ALSO READ | రేపే భారత్ vs జపాన్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే.. ఓపెనర్‌గా బుడ్డోడు!
సూర్య డిజాస్టర్: ఐపీఎల్ 2026లో సూర్యకుమార్ యాదవ్ 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 270 పరుగులే సాధించాడు. ఫలితంగా ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది. ఈ పేలవ ప్రదర్శన కారణంతోనే సూర్య తన టీ20ఐ కెప్టెన్సీని, జాతీయ జట్టులో చోటును కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ విమర్శలన్నింటినీ అధిగమించి ఐపీఎల్ 2027లో ముంబై ఇండియన్స్ తరఫున రీ-ఎంట్రీ ఇచ్చి మళ్లీ పాత సూర్యను మైదానంలో చూపించాలని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.
