సికింద్రాబాద్: శామీర్‌పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును వెనుక నుంచి బైక్ ఢీ కొట్టిన ఘటనలో బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫోజీ హోటల్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో షాపూర్‌కు చెందిన రాజు (42) తీవ్రంగా గాయపడి, ఘటనా స్థలంలోనే చనిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న శామీర్‌పేట పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
►ALSO READ | జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన డి.అశోక్
