సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు: డిగ్రీ అర్హతతో నర్సింగ్, క్లర్క్ పోస్టులు..పూర్తి వివరాలు ఇవే!

సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు: డిగ్రీ అర్హతతో  నర్సింగ్, క్లర్క్ పోస్టులు..పూర్తి వివరాలు ఇవే!

సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే (ఎస్ సీఆర్) రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్ సీ) జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (జీడీసీఈ) కోటా కింద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో (బీజెడ్ఏ, జీటీఎల్, జీఎన్ టీ డివిజన్లు, ఆర్ వైపీఎస్ సహా) ప్రస్తుతం క్రమబద్ధమైన సేవలు అందిస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే అప్లై చేయడానికి అర్హులు. అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 17న ప్రారంభం కాగా, అక్టోబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 33‌‌‌‌‌‌‌ (జీడీసీఈ కోటా).

పోస్టు పేరు: నర్సింగ్ సూపరింటెండెంట్ 

ఖాళీలు: 14.

విద్యార్హత: రిజిస్టర్డ్ నర్స్, మిడ్‌‌‌‌వైఫ్ సర్టిఫికెట్ (ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థ నుంచి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌‌‌‌వైఫరీలో మూడేళ్ల కోర్సు) లేదా బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగి ఉండాలి.

పోస్టు పేరు: హెల్త్   & మలేరియా ఇన్ స్పెక్టర్ గ్రేడ్ II 

ఖాళీలు: 03.

విద్యార్హత: కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్‌‌‌‌గా బీఎస్సీ డిగ్రీతోపాటు హెల్త్/ శానిటరీ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌లో ఏడాది డిప్లొమా కలిగి ఉండాలి లేదా ఎన్‌‌‌‌సీవీటీ గుర్తింపుతో హెల్త్ శానిటరీ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌లో ఏడాది ఎన్‌‌‌‌టీసీ సర్టిఫికెట్ అర్హత కలిగి ఉండాలి.

పోస్టు పేరు: సీసీటీసీ (కమర్షియల్ కం టికెట్ క్లర్క్). ఖాళీలు: 16.

విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి (+2 స్టేజ్) లేదా సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయసు: 2027, జనవరి 1 నాటికి 42 ఏళ్లు మించకూడదు.  ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 17.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు, మైనార్టీలు, ఈబీసీలకు, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులు రూ.250, జనరల్ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. 

లాస్ట్ డేట్: అక్టోబర్ 17.

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.scr.indianrailways.gov.inను సందర్శించండి. 

కంప్యూటర్ బేస్డ్​ టెస్ట్ 
ఆన్​లైన్ విధానంలో జరిగే ఎగ్జామ్​లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రొఫెషనల్ ఎబిలిటీ నుంచి 70 ప్రశ్నలు 70 మార్కులకు, జనరల్ అవేర్​నెస్ నుంచి10 ప్రశ్నలు 10 మార్కులకు, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్  & రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులకు, జనరల్ సైన్స్  నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులకు ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉన్నది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. సబ్జెక్టు లేదా సెక్షన్ల వారీగా ప్రశ్నల విభజన అనేది ప్రాథమిక అంచనా మాత్రమే. ఇందులో మార్పులు ఉండే అవకాశం ఉంది.

►ALSO READ | బ్యాచిలర్ డిగ్రీ, MBAతో RITESలో ఉద్యోగం.. అక్టోబర్ 8 లాస్ట్ డేట్