Bigg Boss Telugu 10: తీపి మానేసి దెబ్బతిన్న కృష్ణుడు.. నాగార్జున క్లాస్ తర్వాత షాకింగ్ ఎలిమినేషన్!

Bigg Boss Telugu 10: తీపి మానేసి దెబ్బతిన్న కృష్ణుడు.. నాగార్జున క్లాస్ తర్వాత షాకింగ్ ఎలిమినేషన్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రేసు నుంచి ఆసక్తికరమైన ట్విస్ట్‌తో నటుడు కృష్ణుడు నిష్క్రమించారు. మొదటి వారం చైత్ర రాయ్ ఎలిమినేట్ అవ్వగా, రెండో వారంలో తీవ్ర ఉత్కంఠ మధ్య కృష్ణుడు హౌస్‌కి బై-బై చెప్పారు. నామినేషన్స్ క్లైమాక్స్‌లో సుధీర్, సృష్టి, కృష్ణుడు డేంజర్ జోన్‌లో నిలవగా.. తక్కువ ఓట్ల తేడాతో కృష్ణుడి ప్రయాణానికి హోస్ట్ నాగార్జున స్వస్తి పలికారు.

ఎలిమినేషన్ కి అసలు కారణం ఇదేనా?

హౌస్‌లోకి భారీ అంచనాలతో అడుగుపెట్టిన కృష్ణుడు.. ఆటలో మాత్రం ఆశించినంత జోష్ చూపించలేకపోయారు. సైలెంట్‌గా ఉండటం, టాస్కుల్లో వెనుకబడటంతో హౌస్‌లో ఉంటూ టీవీ చూస్తున్నావా ఏంటి? అంటూ నాగ్ క్లాస్ కూడా పీకారు. స్టేజ్‌పైకి వచ్చాక తన ఎలిమినేషన్‌కి అసలు కారణం ఫిజికల్ ఫిట్‌నెసే అని కృష్ణుడు ఒప్పుకున్నారు. హౌస్‌లోకి వచ్చాక ఒక్కసారిగా స్వీట్లు బంద్ చేయడం వల్ల నీరసించిపోయి సరిగ్గా ఆడలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వీడ్కోలు సమయంలో రోహిత్ కంటతడి పెట్టుకుని కృష్ణుడిని తన తండ్రితో పోల్చడం ఎమోషనల్ హైలైట్‌గా నిలిచింది. వెళ్తూ వెళ్తూ కృష్ణుడు హౌస్‌మెట్స్‌ని పాజిటివ్, నెగెటివ్ గ్రూపులుగా విభజించారు. దేబ్జానీ, ఝాన్సీ, సృష్టి, అమన్‌లను పాజిటివ్‌గా తెలపగా.. సుధీర్, ముఖేష్, వర్షిణి, చరణ్‌లను నెగెటివ్ కేటగిరీలో పెట్టేశారు. ఇక నెక్స్ట్ వీక్ 'బెస్ట్ ప్లేయర్' ఓటింగ్‌లో ముఖేష్ టాప్ ప్లేస్‌ సాధించి అందరి దృష్టినీ ఆకర్షించారు.

2 వారాల సంపాదన ఎంతో తెలుసా?

ఆట ముగిసినా కృష్ణుడు అందుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది.  ఆయనకు వారానికి రూ. 3 లక్షల చొప్పున ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అంటే కేవలం రెండు వారాల వ్యవధిలోనే దాదాపు రూ. 6 లక్షల పారితోషికం జేబులో వేసుకుని ఇంటికి వెళ్లారని జోరుగా ప్రచారం జరుగుతోంది.