ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి దగ్గర ధర్నా కేసులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు విడుదల చేశారు. ధర్నా చేసిన నిరసనకారులందరినీ పోలీసులు విడుదల చేశారు. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం పీఎస్ నుంచి రాహుల్, మందిర్ మార్గ్ పీఎస్ నుంచి ప్రియాంక విడుదలయ్యారు. ప్రియాంక గాంధీ కోసం సోనియా గాంధీ మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు.
#WATCH | Delhi | Congress MP Priyanka Gandhi Vadra says, "... If the Leader of the Opposition wishes to speak in Parliament, he is not allowed to do so. If we seek permission to stage a protest, that permission is denied. So we went to a place where they least expected us." pic.twitter.com/rLF8uXfmfe
— ANI (@ANI) July 21, 2026
ఇదిలా ఉండగా.. నిరసనకారులను అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసుల దురుసు ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్ట సభల ప్రతినిధులమైన తమతోనే పోలీసులు ఇంత అణచివేత ధోరణితో వ్యవహరిస్తే.. ఇక సామాన్య నిరసనకారుల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారు. ప్రధాని మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
#WATCH | Delhi: LoP Lok Sabha & Congress MP Rahul Gandhi leaves from Chhatrasal Stadium.
— ANI (@ANI) July 21, 2026
Some of the opposition leaders, who were protesting at Lok Kalyan Marg and detained by Delhi Police, were brought to Chhatrasal Stadiuma short while ago. pic.twitter.com/1phdnpjK54
ప్రధాని మోదీ ఇంటి ముందు బలవంతంగా ఈడ్చుకెళ్లడంతో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ముక్కు నుంచి రక్తం కారింది. అయినప్పటికీ పోలీసులు ఆయనను వదిలిపెట్టలేదు. బలవంతంగా కాళ్లూచేతులు పట్టుకుని వ్యాన్ ఎక్కించారు. రాహుల్ ముక్కు వెంట రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అరెస్ట్ తర్వాత రాహుల్ గాంధీతో పాటు ధర్నాలో భాగమైన అందరినీ ఛత్రసాల్స్టేడియంకు పోలీసులు తీసుకెళ్లారు. కనీసం డాక్టర్ను కూడా పిలవకుండా పోలీసులు చోద్యం చూశారు. రాహుల్వ్యక్తిగత భద్రతా సిబ్బంది చికిత్స అందించడం గమనార్హం.
