అంబరాన్నంటిన సంబురం.. ఫిఫా వరల్డ్‌‌ కప్‌‌ విజేతకు స్వదేశంలో ఘన స్వాగతం

అంబరాన్నంటిన సంబురం.. ఫిఫా వరల్డ్‌‌ కప్‌‌ విజేతకు స్వదేశంలో ఘన స్వాగతం
  • రోడ్‌‌ షోతో ఊగిపోయిన మాడ్రిడ్‌‌ వీధులు

ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్​ను స్వదేశానికి తీసుకొచ్చిన వేళ.. స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఊగిపోయింది. 16 ఏళ్లుగా ఎదురుచూసిన కలల కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కళ్ల ముందు ఆవిష్కృతం కావడంతో మాడ్రిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీధులు సంబురంలో మునిగిపోయాయి. స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయం ఖరారు కాగానే దేశంలో పండుగ వాతావరణం నెలకొంది. వేలాది మంది అభిమానులు జాతీయ జెండాలు పట్టుకుని వీధుల్లోకి వచ్చారు. 

బార్లు, రెస్టారెంట్ల నుంచి బయటకు వచ్చి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. మెగా టోర్నీలో చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచిన 11 మంది సభ్యుల బృందం సోమవారం ప్రత్యేక విమానంలో మాడ్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది. నగర వీధుల్లో ఆటగాళ్లతో ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బస్సులో భారీ ఊరేగింపుతో విజయ యాత్రను నిర్వహించారు.

మాడ్రిడ్‌‌: ఫిఫా వరల్డ్‌‌ కప్‌‌ సగర్వంగా స్వదేశానికి తీసుకొచ్చిన వేళ.. స్పెయిన్‌‌ ఊగిపోయింది. 16 ఏళ్లుగా ఎదురుచూసిన కలల కప్‌‌ కళ్ల ముందు ఆవిష్కృతం కావడంతో.. మాడ్రిడ్‌‌ వీధులు సంబురంలో మునిగిపోయాయి. స్పెయిన్‌‌ విజయం ఖరారు కాగానే దేశంలో పండగ వాతావరణం నెలకొంది. వేలాది మంది అభిమానులు జాతీయ జెండాలు పట్టుకుని వీధుల్లోకి వచ్చారు. 

బార్లు, రెస్టారెంట్ల నుంచి బయటకు వచ్చి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. కార్ల హారన్లు మ్రోగిస్తూ, బాణా సంచా కాలుస్తూ తెల్లవారుజాము వరకు వేడుకల్లో మునిగిపోయారు. ఇక మెగా టోర్నీలో చాంపియన్‌‌గా నిలిచిన 11 మంది సభ్యుల బృందం సోమవారం ప్రత్యేక విమానంలో మాడ్రిడ్​కు చేరుకుంది. ప్లేయర్లను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌‌తో మాడ్రిడ్‌‌ బరాజాస్‌‌ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది.  

కెప్టెన్‌‌ రోడ్రి కప్‌‌తో విమానం నుంచి బయటకు రావడంతో ఎయిర్‌‌పోర్ట్‌‌లో వేచి చూసిన ఫ్యాన్స్‌‌ ఒక్కసారిగా కేరింతల్లో మునిగిపోయారు. ఒకరి తర్వాత ఒకరుగా బయటకు వచ్చిన ప్లేయర్లు రన్‌‌వే పక్కనే స్పెషల్‌‌గా ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ తర్వాత స్పెయిన్‌‌ రాజప్రసాదం వద్ద  ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్‌‌ ఘన స్వాగతం పలికారు. సాయంత్రం మాడ్రిడ్‌‌ నగర వీధుల్లో ఆటగాళ్లతో ఓపెన్‌‌ టాప్‌‌ బస్సులో భారీ ఊరేగింపుతో విజయ యాత్రను నిర్వహించారు. 

ప్రధాని అధికారిక నివాసమైన మోంక్లోవా ప్యాలెస్‌‌ సమీపం నుంచి సిబెలెస్‌‌ స్క్వేర్‌‌ వరకు సాగిన ఈ ర్యాలీలో వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. 35 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయకుండా స్క్వేర్‌‌ వద్ద అభిమానులు గొడుగులతో ఉదయం నుంచే వేచి చూశారు. గతంలో స్పెయిన్‌‌ జట్లు విజయం సాధించినప్పుడు వేడుకలు జరుపుకున్న సాంప్రదాయ వేదిక సిబెలెస్‌‌ స్క్వేర్‌‌లోనే ఈసారి కూడా ఆటగాళ్లను సన్మానించారు. 

గోల్స్, టెక్నాలజీ, బ్రేక్స్..

మూడు దేశాలు.. ఆరు వారాలు.. 104 మ్యాచ్‌‌లతో ఫిఫా వరల్డ్‌‌ కప్‌‌ యావత్‌‌ ప్రపంచాన్ని ఊపేసింది. ఫైనల్లో ఆఖరి విజిల్‌‌ వేసేవరకు గ్లోబ్‌‌ మొత్తం ఫుట్‌‌బాల్‌‌ మాయలోనే మునిగిపోయింది. ఉత్కంఠ భరిత పోరాటాలు.. అనూహ్య విజయాలు.. అద్భుతమైన గోల్స్‌‌తో టోర్నీ ఆద్యంతం అభిమానులను అలరించింది. ఇరాన్‌‌పై యుద్ధం, రాజకీయ ఉద్రిక్తతలు, హైడ్రేషన్‌‌ బ్రేక్‌‌ (ఎండ తీవ్రతను తట్టుకునేందుకు) వంటి కొత్త రూల్స్‌‌పై విమర్శలు వచ్చినా టోర్నీపై అభిమానం మాత్రం తగ్గలేదు. 

టోర్నీలో జట్ల సంఖ్యను 48కి పెంచడం వల్ల గ్రూప్‌‌ దశ మ్యాచ్‌‌లు ఏకపక్షంగా సాగుతాయనే ఆందోళన వ్యక్తమైంది. కానీ కేప్‌‌ వెర్డే,  కాంగో, కురసావో వంటి చిన్న జట్ల అద్భుత ప్రదర్శనతో ఫుట్‌‌బాల్‌‌కు కొత్త అభిమానులను ఏర్పర్చుకుంది. కేప్‌‌ వెర్డే గోల్‌‌ కీపర్‌‌ వోజిన్హా ఓవర్‌‌నైట్‌‌ స్టార్‌‌ అయ్యాడు. ఈ టోర్నీలో వీడియో అసిస్టెంట్‌‌ రిఫరీ నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. బంతిలో అమర్చిన ప్రత్యేక సెన్సర్ల కారణంగా కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. 

కీలక మ్యాచ్‌‌లకు టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. దాంతో సగటు ఫ్యాన్స్‌‌ దీనిపై విపరీతమైన విమర్శలు చేశారు. యూఎస్‌‌ ప్లేయర్‌‌ ఫోలారిస్‌‌ బలోగన్‌‌ రెడ్‌‌ కార్డు నిషేధంలో ప్రెసిడెంట్‌‌ ట్రంప్ జోక్యం చేసుకోవడం అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నిషేధాన్ని రౌండ్‌‌ ఆఫ్‌‌ 16 మ్యాచ్‌‌కు ముందే ఎత్తివేయడంతో ఫిఫా ప్రెసిడెంట్‌‌ జియాని ఇన్ఫాంటినోపై విమర్శలు వచ్చాయి. 


రెండోసారి విశ్వవిజేతగా..

న్యూజెర్సీలోని ఈస్ట్‌‌ రూథర్‌‌ఫోర్డ్‌‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో స్పెయిన్‌‌ 1–0తో డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ అర్జెంటీనాను ఓడించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. 2010లో సౌతాఫ్రికాలో గెలిచిన తర్వాత స్పెయిన్‌‌ మెగా టైటిల్‌‌ సాధించడం ఇది రెండోసారి. మ్యాచ్‌‌ ఆరంభం నుంచే స్పెయిన్‌‌ దూకుడుగా ఆడితే.. అర్జెంటీనా ఆత్మ రక్షణ ధోరణితో ముందుకెళ్లింది. దాంతో స్టార్‌‌ ప్లేయర్‌‌ లియోన్‌‌ మెస్సీ స్పెయిన్‌‌ రక్షణ శ్రేణిని ఛేదించడంలో విఫలమయ్యాడు. 

అదే టైమ్‌‌లో స్పెయిన్‌‌ కూడా గోల్స్‌‌ చేసే అవకాశాలను సృష్టించలేకపోయింది. దాంతో మ్యాచ్‌‌ ఎక్స్‌‌ట్రా టైమ్‌‌కు దారి తీసింది. చివరకు 106వ నిమిషంలో ఫెరాన్‌‌ టోరెస్‌‌ గోల్‌‌ కొట్టి స్పెయిన్‌‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తాజా విజయంతో స్పెయిన్‌‌ సరికొత్త రికార్డు సృష్టించింది. 2023 విమెన్స్‌‌ వరల్డ్‌‌ కప్‌‌ను గెలుచుకున్న స్పెయిన్‌‌ ఇప్పుడు మెన్స్‌‌ వరల్డ్‌‌ కప్‌‌ను కూడా కైవసం చేసుకుంది. 

తద్వారా ఒకే సమయంలో రెండు కేటగిరీల్లోనూ వరల్డ్‌‌ చాంపియన్‌‌గా నిలిచిన మొదటి యూరోపియన్‌‌ దేశంగా స్పెయిన్‌‌ చరిత్రకెక్కింది. ఈ వరల్డ్‌‌ కప్‌‌ ప్రైజ్‌‌మనీ మొత్తం రూ. 6306 కోట్లు కాగా చాంపియన్‌‌గా నిలిచిన స్పెయిన్‌‌ రూ. 481 కోట్లు సొంతం చేసుకుంది. అర్జెంటీనాకు 317 కోట్లు, మూడు, నాలుగో ప్లేస్‌‌లో నిలిచిన ఇంగ్లండ్‌‌, ఫ్రాన్స్‌‌కు వరుసగా రూ. 279 కోట్లు, రూ. 259 కోట్లు లభించాయి.

 ఎంబాపెకు గోల్డెన్‌‌ బూట్‌‌

గోల్డెన్‌‌ బూట్‌‌ రేసులో ఎంబాపె, మెస్సీ, హాలాండ్‌‌, హ్యారీ కేన్‌‌, బెల్లింగ్‌‌హామ్‌‌ ఆకట్టుకున్నారు. ఎంబాపె టోర్నీలో అత్యధికంగా 10 గోల్స్‌‌ చేసి తన కెరీర్‌‌లో వరల్డ్‌‌ కప్‌‌ గోల్స్‌‌ సంఖ్యను 22కు పెంచుకున్నాడు. మెస్సీ 8 గోల్స్‌‌  తో కలిపి 21 గోల్స్​తో ఉన్నాడు.