డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela).. ఇపుడు ఈ పేరుకు టాలీవుడ్లో అఖండమైన క్రేజ్ ఉంది. డైరెక్ట్ చేసింది ఒక్క సినిమానే అయిన.. తన ఫస్ట్ మూవీతోనే వందకోట్ల బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. హీరో నాని (Nani)తో అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్గా వచ్చిన దసరాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు.
అప్పటినుండి ఈ దర్శకుడు నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా.. అది సెన్సేషనల్ అవుతుంది. అందులో భాగంగానే ఇవాళ నాని (ఫిబ్రవరి 24న) బర్త్ డే సందర్భంగా ఈ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. నువ్వు నమ్మినంతగా నన్ను ఎవరూ నమ్మలేదు అన్న. "నువ్వు చూపిస్తున్న ప్రేమకు, నాపై పెట్టుకున్న నమ్మకానికి జీవితమంతా రుణపడి ఉంటానని" అని హీరో నానికి డైరెక్టర్ శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు.
‘‘ నాని అన్నా, నువ్వు ‘నీ ఇష్టం శ్రీకాంత్’ అని అన్న ప్రతిసారీ.. ‘నేను నిన్ను నమ్ముతాను శ్రీకాంత్’ అన్నట్లు వినిపిస్తుంది. ఒక్కోసారి నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకం నన్ను భయపెడుతుంది. ప్రతి క్షణం ‘ది ప్యారడైజ్’ కోసం నా రక్తాన్ని, నా ఆత్మను.. మొత్తం నా సర్వస్వాన్ని ధారపోస్తున్నాను.
ఈ క్రమంలో నేను మీ సినిమా రూల్స్‌ను బ్రేక్ చేశా, నీ వర్కింగ్ అవర్స్ మార్చి బ్రేక్ చేశా.. ఆఖరికి నీ సినిమాల విడుదల తేదీలనూ కూడా బ్రేక్ చేశా.. దాదాపు నేను మీ ‘సినిమా నిర్మాణం’ అనే ప్రతి నియమాన్ని బ్రేక్ చేశా. ఇన్ని చేసినా నువ్వు ఒక్కమాట కూడా అనలేదు. అదే నా బాధ్యతను మరింత పెంచుతోంది.. ఈ రోజు నా దగ్గర ఉన్నదంతా మీ వల్లనే అనే విధంగా మీరు నన్ను నిర్మించారు.
►ALSO READ | VijayRashmika: ఉదయ్ పూర్లో పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తున్న విజయ్–రష్మిక.. ఫోటోలు వైరల్
నువ్వు నమ్మినంతగా నన్ను ఎవరూ నమ్మలేదు అన్న. నేను నిన్ను ప్యారడైజ్’ కోసం జడలు వేసుకోమని అడిగాను.. నువ్వు ‘‘ఓకే రా నీ ఇష్టం’’ అన్నావు. నీ చేతి మీద టాటూగా స్లర్ వేసుకోమని అడిగాను.. నువ్వు ‘‘ఓకే రా నీ ఇష్టం’’ అన్నావు. నేను నిన్ను ప్రతిరోజూ లెక్కలేనన్ని రీటేక్‌లతో హింసిస్తున్నాను.. నువ్వు కేవలం - ‘‘ఓకే రా నీ ఇష్టం’’ అంటున్నావు.
Nani Anna,
— Srikanth Odela (@odela_srikanth) February 24, 2026
Nuvvu "Ni istam Srikanth" ani anna prathisari I hear "I trust you Srikanth"
And that trust scares me, every single second to give my blood and soul to The Paradise.
I broke your every rule of cinema.
I broke your working days pattern...
I broke your release date… pic.twitter.com/p7Z1pFKrx8
నేను నీకు ఎప్పుడూ ఇలా నేరుగా చెప్పలేదు కానీ, ఇప్పుడు చెపుతున్న అన్నా... నువ్వు ఎప్పుడూ ‘‘నీ ఇష్టం శ్రీకాంత్’’ అని ఎందుకు అంటావో దానికి సమాధానం కోసం నా జీవితంలోని ప్రతి సెకనును నిరంతరం వెంబడిస్తూ ఉంటాను. చివరగా.. నన్ను నమ్మినా నా ధరణికి, నన్ను మళ్ళీ నమ్ముతున్న నా జడల్కి.. పుట్టినరోజు శుభాకాంక్షలు నాని అన్న.. జీవితమంతా రుణపడి ఉంటాను’’ అని శ్రీకాంత్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారి నాని ఫ్యాన్స్ని ఆకట్టుకుంటోంది.
