టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకోనున్నారు. ఫిబ్రవరి 24–25న ఉదయ్‌పూర్‌కి 25 కిమీ దూరంలో ఉన్న లగ్జరీ హోటల్ ITC Mementosలో ప్రీ–వెడ్డింగ్ వేడుకలు షురూ అవుతాయి. ఇన్నాళ్లు తమ బంధాన్ని సీక్రెట్గా ఉంచిన ఈ జంట, ఆదివారం తమ పెళ్లిని అధికారంగా “ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్” గా ప్రకటించింది. ఈ ప్రకటనతో ఫ్యాన్స్లో తెగ క్యూరియాసిటీ పెరిగింది.
ఇందులో భాగంగా సోమవారం ఫిబ్రవరి 23న, రష్మిక మరియు విజయ్.. ఓ 50 మంది ఆహ్వానితులతో ఉదయ్‌పూర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయ్-రష్మిక షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వెడ్డింగ్ వేదిక, డెకర్, విందులు, వినోదం వంటి ప్రత్యేక అంశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలను చూస్తుంటే, విజయ్-రష్మిక పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా అర్ధమవుతోంది.
విజయ్ షేర్ చేసిన ఫోటోలు:
విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో షేర్ చేశారు. ఇందులో ఓ భారీ విశాలమైన స్విమ్మింగ్ ఫుల్లో వాలీబాల్ నెట్ కట్టి, వాలీ బాల్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇది వెడ్డింగ్లో ప్లేఫుల్ గేమ్ జరుగుతున్నదని ఫోటో సూచిస్తోంది. మరో షాట్‌లో, పూల్ మధ్య ఫ్లోటింగ్ డ్రింక్ స్టేషన్ అన్నట్లుగా ఉంది.
రష్మిక షేర్ చేసిన ఫోటోలు:
రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అందమైన డెకరేషన్తో ఉన్న డైనింగ్ టేబుల్ ఫోటో షేర్ చేసింది. గోధుమ రంగులో మెరిసే టేబుల్‌స్కేప్, మధ్యలో పింక్ కలర్ లిలీస్ మరియు పచ్చని రంగుతో కనిపించే అందమైన పుష్పాలతో అమర్చబడిన డెలికేట్ ఫ్లోరల్ అరిజ్‌మెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
పచ్చటి యాపిల్స్, జామకాయలతో కలిపి, గార్డెన్-మీట్స్-లగ్జరీ ఎస్తెటిక్స్‌ను పంచుకుంది. టేబుల్ పై ఉన్న బేస్‌పాక్ ప్రింటెడ్ మెనూ కార్డ్, ప్రత్యేకంగా కూర్చిన జపనీస్ డైనింగ్ టేబుల్ ఆసక్తిగా మారింది.
