రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు శనివారం బంగారం వెండి రేట్లు భారీ ర్యాలీతి షాక్ ఇచ్చాయి. చాలా రోజుల తర్వాత మళ్లీ విలువైన లోహాలు దూసుకుపోతున్నాయి. ప్రధానంగా అమెరికా ఇరాన్ టెన్షన్స్ ఒకపక్క కొత్తగా మెుదలైన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను పెంచేశాయి. దీనికి తోడు ముదురుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలతో ఇన్నాళ్లుగా తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్ తిరిగి మళ్లీ పుంజుకుంటూ దూసుకుపోతున్నాయి.
ఫిబ్రవరి 28న బంగారం రేట్లు పెరిగి వినియోగదారులకు షాకిచ్చాయి. దీంతో ఫిబ్రవరి 27 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.316 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 473గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.15వేల 100గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ALSO READ : హాలీవుడ్‌లో భారీ డీల్
ఇక వెండి విషయానికి వస్తే ఫిబ్రవరి 28, 2025న రేటు కేజీకి రూ.10వేలు పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.3లక్షలకు చేరుకుంది. అంటే గ్రాము ధర రూ.300 వద్ద ఉంది.
