- పేరుతో సొంత ఉత్పత్తుల అమ్మకం
న్యూఢిల్లీ:ఫ్లిప్‌కార్ట్ తన క్విక్ కామర్స్ విభాగమైన మినిట్స్ ద్వారా పిక్డ్ పేరుతో కొత్త ప్రైవేట్ లేబుల్‌ను లాంచ్ చేసింది. థర్డ్ పార్టీ బ్రాండ్లపై పూర్తిగా ఆధారపడకుండా సొంత ఉత్పత్తులను అందించాలని నిర్ణయించుకుంది. పట్టణ ప్రాంతాలలో ప్రీమియం వస్తువులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో ఈ రంగంలో పోటీ మరింత తీవ్రతరం కానుంది. బ్లింకిట్ ఇప్పటికే గార్మెట్ పేరుతో సేవలను ప్రారంభించింది.
జెప్టో కూడా సెలెక్ట్ పేరుతో ప్రీమియం కిరాణా సేవలను తీసుకువచ్చింది. ఈ విభాగంలో ఇతర కంపెనీలకు దీటుగా నిలవడానికి ఫ్లిప్‌కార్ట్ తన సొంత బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారులకు వేగంగా నాణ్యమైన సేవలను అందించడమే లక్ష్యంగా ఈ సంస్థలు ముందుకు సాగుతున్నాయి. ఫ్లిప్కార్ట్ గార్మెట్ కిరాణా మార్కెట్లోకి కూడా అడుగుపెట్టింది. ప్రీమియం, ప్రత్యేక ఆహార ఉత్పత్తులను అమ్మనుంది.
