- మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు ఈ నెల 11 నుంచి 21 వరకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ‘స్పెషల్ మాన్సూన్ డ్రైవ్’ నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో జీహెచ్‌ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్ సింగ్ నాయక్, ఎంటమాలజీ అధికారులతో కలిసి డ్రైవ్‌కు సంబంధించిన అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే–డ్రైడే’ పాటిస్తూ ఇళ్లు, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. డ్రైవ్‌లో భాగంగా జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేయడంతో పాటు ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్లు చేపడతారని అమర్ సింగ్ నాయక్ తెలిపారు .
