హైదరాబాద్లో ఏఐ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్ సదస్సు

హైదరాబాద్లో ఏఐ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్ సదస్సు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫిక్కీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్​ హైదరాబాద్​లో ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణపై సదస్సు నిర్వహించింది. ‘రోగ నిర్ధారణ నుంచి డిజిటల్ ఆరోగ్య వ్యవస్థల రూపకల్పన’ అనే అంశంపై ఈ వేదికగా చర్చించారు. ఆరోగ్య రంగంలో ఏఐ సామర్థ్యాలు, పరిమితులను వివరిస్తూ రూపొందించిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. డాక్టర్లు, పరిశోధకులు, పాలసీ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న నగరాలకు కూడా నివారణ వైద్య సేవలను విస్తరించాలని అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ వాడకం ఆసుపత్రులలో రోగుల వేచి ఉండే సమయం తగ్గుతుందని నిపుణులు తెలిపారు. డిజిటల్ ఆరోగ్య పరివర్తనలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి  కార్యాచరణ రూపొందించాలని కోరారు.