సంస్కరణలతోనే.. సంక్షోభాలను ఎదుర్కొన్నాం:మంత్రి నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌

సంస్కరణలతోనే.. సంక్షోభాలను ఎదుర్కొన్నాం:మంత్రి నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: గత పదేళ్లలో చేపట్టిన  బ్యాంకింగ్ సంస్కరణలతోపాటు, ఖర్చులు తగ్గించుకుంటూ ఆదాయాలు పెంచుకోవడం, ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరచడం వల్లనే  అంతర్జాతీయ సంక్షోభాలను తట్టుకుని భారత్ నిలబడగలిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలో శనివారం జరిగిన  కౌటిల్య ఎకనామిక్ కాన్​క్లేవ్‌‌‌‌‌‌‌‌లో ఆమె మాట్లాడారు. సంక్షోభాల్లోనూ వృద్ధి ఆగకుండా ఉండేందుకు ప్రభుత్వ ఖజనా బాగుండడం  కీలకమనే కౌటిల్యుడి మాటలను ఆమె ప్రస్తావించారు. 

పెట్రోల్ బంకుల వద్ద క్యూలు లేకపోవడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటమే ఆర్థిక స్థిరత్వానికి నిదర్శనమన్నారు. ‘‘ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌–జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీడీపీ వృద్ధి రేటు 7.8శాతంగా నమోదైంది.  766 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు మన బలాన్ని చూపుతున్నాయి.  జేఏఎం (జన్‌‌‌‌‌‌‌‌ధన్,-ఆధార్,-మొబైల్), డైరెక్ట్ టూ బెనిఫిషరీస్‌‌‌‌‌‌‌‌ (డీబీటీ) , 52 కోట్లకు పైగా ముద్రా రుణాలు, పీఎం ఆవాస్ వంటి పథకాలు పేదలకు అండగా నిలిచాయి. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మౌలిక వసతులకు రూ.12.22 లక్షల కోట్లు కేటాయించాం. 2047 నాటికి 'వికసిత భారత్' సాధనకు సెమీకండక్టర్లు, కీలక ఖనిజాల భద్రతలో స్వయంసమృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యం”అని నిర్మల వివరించారు.