దేశవ్యాప్తంగా ఫర్టిలైజర్ బుకింగ్ విధానం అమలు

దేశవ్యాప్తంగా ఫర్టిలైజర్ బుకింగ్ విధానం అమలు
  •     మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ప్రవేశపెట్టిన మొబైల్ ఫర్టిలైజర్ బుకింగ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో యూరియాతో ప్రారంభించిన డిజిటల్ బుకింగ్ విధానాన్ని ‘ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పేరుతో అన్ని రకాల ఎరువులకు విస్తరించనున్నట్లు తెలిపారు.  ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడకుండా, మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే బుక్ చేసుకొని సమీప డీలర్ వద్ద స్టాక్ వివరాలు తెలుసుకునేలా ఈ విధానాన్ని రూపొందించినట్లు వివరించారు. 

ఆధార్ ఒక్కటే ప్రాతిపదికగా కాకుండా, వాస్తవ సాగు విస్తీర్ణం, పంట రకం ఆధారంగా ఎరువులు అందేలా మార్పులు చేశామని తెలిపారు. దీంతో సబ్సిడీ ఎరువుల దుర్వినియోగం, అక్రమ నిల్వలకు అడ్డుకట్ట పడనుందని వెల్లడించారు. కొత్త విధానం ప్రారంభంలో సాంకేతిక సమస్యలు ఎదురైనప్పటికీ వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. అప్పట్లో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఈ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వ్యతిరేకించారని గుర్తుచేశారు. రైతు ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అవకాశం ఉండకూడదని, సాంకేతికత రైతుకు భరోసా కల్పించేలా ఉండాలని తెలిపారు.