లాల్ దర్వాజా బోనాలు.. సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ

లాల్ దర్వాజా బోనాలు.. సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ

ప్రముఖ టాలివుద్ నటుడు విజయ్ దేవరకొండ పాతబస్తీలోని చారిత్రక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల  పండుగ సందర్భంగా ఆలయానికి వచ్చిన విజయ్ దేవరకొండ.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. విజయ్ దేవరకొండ రాకతో ఆలయ పరిసర ప్రాంతాల్లో బోనాల జాతరకు మరింత  సందడి వాతావరణం నెలకొంది.

లాల్ దర్వాజా బోనాలు ఆదివారం (ఆగస్టు 9) ఘనంగా ప్రారంభమయ్యాయి. లాల్ దర్వాజా ప్రధాన ఆలయంలో అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టువస్త్రాల సమర్పించనున్నారు. 

బోనాల జాతర సందర్భంగా లాల్ దర్వాజా ఆలయంలో అమ్మవారి  దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజామునుంచే భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించి నైవేద్యం పెట్టారు. లాల్ దర్వాజా ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు.  పాతబస్తీ బోనాల ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

సోమవారం  (ఆగస్టు 10)  రంగం (భవిష్యవాణి), పోతురాజుల విన్యాసాలు ,అమ్మవారి సాంబశివ రథయాత్ర ఘట్టం ముగింపుతో  ఉత్సవాలు ముగిస్తాయి.