SBI క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది.. మొత్తం 1538 పోస్టులు.. ప్రభుత్వ ఉద్యోగం కొట్టేందుకు గోల్డెన్ ఛాన్స్!

SBI క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది.. మొత్తం 1538 పోస్టులు.. ప్రభుత్వ ఉద్యోగం కొట్టేందుకు గోల్డెన్ ఛాన్స్!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) క్లర్క్ కేడర్‌లోని జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అర్హులు కాదు.

పోస్టు పేరు: జూనియర్ అసోసియేట్.

మొత్తం ఖాళీలు: 1538 (ఎస్సీ 207, ఎస్టీ 1219, ఓబీసీ 112).  హైదరాబాద్ సర్కిల్ పరిధిలో 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సమాన అర్హత కలిగి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం/ సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులు కూడా తాత్కాలికంగా  దరఖాస్తు చేసుకోవచ్చు.  ఎంపికైతే 2026, డిసెంబర్ 31 నాటికి డిగ్రీ ఉత్తీర్ణత సాధించినట్లు సర్టిఫికేట్ సమర్పించడం తప్పనిసరి.

పదో తరగతి/ మ్యాట్రిక్యులేషన్ పూర్తిచేసి కనీసం 15 ఏళ్ల సర్వీసు అనంతరం ఇండియన్ ఆర్మీ స్పెషల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా నేవీ/ఎయిర్​ఫోర్స్ సమాన సర్టిఫికేట్ పొందిన మాజీ సైనికోద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయోపరిమితి: 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్​మన్ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు  7.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మన్​ అభ్యర్థులకు ఫీజు లేదు. ఓబీసీలు అప్లికేషన్ ఫీజు రూ.750 చెల్లించాలి. 

లాస్ట్ డేట్: ఆగస్టు 27.

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: 2026, సెప్టెంబర్.

మెయిన్ ఎగ్జామినేషన్: 2026, అక్టోబర్/ నవంబర్. 

సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (ఎల్ఎల్​పీటీ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ALSO READ : ఇంజినీరింగ్ చేశారా ? NTPCలో భారీగా ప్రభుత్వ ఉద్యోగ పోస్టులు..

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ sbi.bank.inను సందర్శించండి. 

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
ఆన్​లైన్ పద్ధతిలో నిర్వహించే రాత పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు 35 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు 35 మార్కులకు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు. 

మెయిన్ పరీక్షకు ఎంపిక: ఖాళీల సంఖ్య ఆధారంగా ప్రతి కేటగిరీలో దాదాపు 10 రెట్ల మంది అభ్యర్థులను మొత్తం వచ్చిన అగ్రిగేట్ మార్కుల ఆధారంగా మెయిన్ పరీక్షకు షార్ట్​లిస్ట్ చేస్తారు.

మెయిన్ ఎగ్జామినేషన్
ఆన్​లైన్ పద్ధతిలో నిర్వహించే రాత పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 190 ప్రశ్నలు ఇస్తారు. 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. జనరల్/  ఫైనాన్షియల్ అవేర్​నెస్ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు, జనరల్ ఇంగ్లిష్ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్  నుంచి50 ప్రశ్నలు 50 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు 60 మార్కులకు ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు.
తుది మెరిట్ జాబితా: తుది మెరిట్ జాబితా తయారీకి కేవలం మెయిన్ పరీక్షలో సాధించిన మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ప్రిలిమినరీ పరీక్ష మార్కులను కలపరు.

లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (ఎల్ఎల్ పీటీ):
తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన నిర్దిష్ట స్థానిక భాషను 10వ తరగతి లేదా 12వ తరగతిలో చదివి ఉండకపోతే వారు ఉద్యోగంలో చేరే ముందస్తుగా నిర్వహించే స్థానిక భాషా నైపుణ్య పరీక్షకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఎల్ఎల్​పీటీ 50 మార్కులకు ఉంటుంది. నాన్ వెర్బల్ టెస్టులో భాగంగా ఆబ్జెక్టివ్ నుంచి 3 ప్యాసెజ్​లు 15 మార్కులకు, సబ్జెక్ట్​ నుంచి 3 ప్యాసెజ్​లు 15 మార్కులకు ఇస్తారు. వర్బల్ టెస్ట్ 20 మార్కులకు ఉంటుంది.

వెయిట్ లిస్ట్  విధానం:  రాష్ట్రాలు, కేటగిరీల వారీగా ఖాళీల్లో గరిష్టంగా 50 శాతం వరకు వెయిట్ లిస్టును నిర్వహిస్తారు. తుది ఫలితాలు వెలువడిన తేదీ నుంచి ఏడాదిపాటు ఇది అమలులో ఉంటుంది. ప్రస్తుత బ్యాచ్‌లో ఎవరైనా ఉద్యోగంలో చేరకపోవడం లేదా రాజీనామా చేయడం వల్ల మిగిలిన ఖాళీలను, కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల నుంచి త్రైమాసిక ప్రాతిపదికన ఈ వెయిట్ లిస్ట్ ద్వారా భర్తీ చేస్తారు.