సికింద్రాబాద్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్పా హోటల్ ఎదురుగా ఉన్న ఓ క్రీడా దుకాణంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ప్రేమ్ స్పోర్ట్ షాప్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. షాప్‌లో నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, ఒక ఫైర్ ఇంజన్ సాయంతో శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అయితే, ఉదయం సమయం కావడంతో షాప్‌లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
